సుధీర్ తో పెళ్లి గురించి మాట్లాడుతుంటా.. రష్మి కామెంట్స్!

Published : Aug 25, 2018, 03:37 PM ISTUpdated : Sep 09, 2018, 01:04 PM IST
సుధీర్ తో పెళ్లి గురించి మాట్లాడుతుంటా.. రష్మి కామెంట్స్!

సారాంశం

యాంకర్ గా బుల్లితెరపై పేరు సంపాదించిన రష్మీ నటిగా కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యాంకర్ గా బుల్లితెరపై పేరు సంపాదించిన రష్మీ నటిగా కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో సుడిగాలి సుధీర్ టాపిక్ కూడా ఉంది. 'ఓ రియాలిటీ షో కోసం సుడిగాలి సుధీర్, నేను పెళ్లి చేసుకున్నట్లుగా నటించాం.

కేవలం షో కోసం, జనాలను నవ్వించడానికి అలా చేశాం. ఆ తరువాత దానిపై వివరణ కూడా ఇచ్చాము. అయితే అవేవీ పట్టించుకోకుండా నిజంగానే పెళ్లి జరిగిందన్నట్లు కొందరు అనుకుంటున్నారు. అందులో వాళ్ల తప్పేంలేదు. ఏదొక రోజు నేను పెళ్లి చేసుకుంటాను. సుధీర్ కూడా చేసుకుంటాం. అది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు. సుధీర్, నేను పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటా. అప్పుడు ఇద్దరి పెళ్లి పక్క, పక్క వేదికల మీదే జరగాలని తనతో చెబుతుంటాను.

ఎందుకంటే నేను ముందు పెళ్లి చేసుకుంటే.. సుధీర్ ని మోసం చేశానని అంటారు. అతడు ముందు పెళ్లి చేసుకుంటే నేనే అతడిని మోసం చేశానని అంటారు. అందుకే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి అన్నట్లుగా అతడితో చెబుతుంటాను. సుధీర్ తో నాకు మంచి రిలేషన్ ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

రష్మి చెప్పేవరకు నాకు ఆ విషయం తెలియదు.. 'అంతకుమించి' హీరో!

రష్మి సినిమాపై పోలీస్ కేసు!

రష్మి అందాల ఆరబోత వర్కవుట్ అవుతుందా..?

 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?