నాకు బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మని అడిగా.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 8, 2018, 4:52 PM IST
Highlights

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింది ఏర్పడింది. 

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింది ఏర్పడింది. రీసెంట్ గా ఆమె 'దేవదాస్' సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది.

అయితే టాలీవుడ్ కి రాకముందే రష్మికకి నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం జరిగిపోయింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే అతడితో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది రష్మిక. సినిమాలో అవకాశాలు రావడంతో రక్షిత్ ని వదిలేసిందంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. రష్మిక ఇంట్లో తనకు ఎంతో స్వేచ్చనిస్తారని వెల్లడించింది. తన తల్లితో ఎలాంటి విషయాన్నైనా.. షేర్ చేసుకుంటానని చెప్పింది. ఒకసారి తన తల్లితో జోక్ చేస్తూ.. 'అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకు ఉంటే బాగుండేది' అని అడిగితే రష్మిక తల్లి నిజంగానే కొంతమంది అబ్బాయిల ప్రొఫైల్స్ చూపించి వారిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పిందట. రీసెంట్ గా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

రష్మిక క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్!

ఇప్పుడు అవన్నీ ఎందుకు..? రష్మిక కామెంట్స్!

రష్మిక టాటూ.. లేటెస్ట్ హాట్ టాపిక్!

 

click me!