ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ న్యూస్ లకు కొదవలేదు. క్రేజీ రూమర్స్ కు కూడా కొదవ లేదు. కానీ కొన్ని క్రేజీ న్యూస్ లు ఫ్యాన్స్ కు కిక్క్ ఇస్తాయి. ఈక్రమంలోనే రణ్ వీర్ సింగ్, రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ నుంచి సినిమాలు బాలీవుడ్ లో సత్తా చూపిస్తున్నాయి. దాంతో ఇక్కడి కథలు, సినిమాలను కూడా అక్కడ రీమేక్ చేసేస్తున్నారుస్టార్లు ఈక్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.బాలీవుడ్ లో అల్లరి హీరో రణ్ వీర్ సింగ్ .. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మన రవితేజ లాగానే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ అల్లరి ఓరేంజ్ లో ఉంటుంది. ఆయన సినిమాలు.. ఈవెంట్లలో హడావిడి..యాటీట్యూడ్ అన్నీ కాస్త ఒకేలా ఉంటాయి. అలా చూసుకుంటే..మాస్ మహారాజ్ సినిమాకు రణ్ వీర్ సింగ్ న్యాయం చేస్తాడంటున్నారు ఫ్యాన్స్. అయితే రణ్ వీర్ సింగ్ రీమేక్ చేసేది కూడా.. మాస్ మహారాజా రవితేజకు మంచి కంబ్యాక్ ఇచ్చిన క్రాక్ సినిమా అని తెలుస్తోంది. ఈ మూవీని హిందీలో రణ్‌వీర్ సింగ్ రీమేక్ చేయనున్నాడట. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని రీమేక్ వెర్షన్‌ను కూడా రూపొందించనున్నాడని టాక్.
అంతే కాదు ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయట. దాదాపు ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. త్వరలో ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని బాలయ్యతో వీర సింహా రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈ వీక్ లో ఈమూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది. ఈసినిమా తరువాత గోపీచంద్ చేసే సినిమా బాలీవుడ్ దే అని టాక్.
ఇక బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ రీసెంట్ గా సర్కస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా..ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రణ్‌వీర్ సింగ్‌కు ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఇక మన తెలుగు స్టార్ మాస్ మహారాజ్ కూడా రీసెంట్ గా ధమాకా మూవీతో రాగా... ఈసినిమా కూడా అనుకున్నంత అద్భాన్ని సృష్టించలేకపోయింది. కాకపోతే మాస్ ప్రేక్షకులను మాత్రం అలరిస్తోంది మూవీ. ఇక రణ్‌వీర్ సింగ్ గతంలో టాలీవుడ్ మూవీ టెంపర్ హిందీ రీమేక్‌లో నటించాడు. కాగా ఇపుడు రవితేజ హిట్ మూవీ క్రాక్ పై కన్నేశాడు. మరి మాస్ మహారాజ్ సినిమాతో అయినా.. రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ లో హిట్ కొడతాడేమో చూడాలి.