వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర లీక్ చేసిన చిరంజీవి, మాస్ మహారాజ్ పై స్పెషల్ ట్వీట్ చేసిన మెగాస్టార్

Published : Dec 27, 2022, 11:22 PM ISTUpdated : Dec 27, 2022, 11:24 PM IST
వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర లీక్ చేసిన చిరంజీవి, మాస్ మహారాజ్ పై స్పెషల్ ట్వీట్ చేసిన మెగాస్టార్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి  హీరోగా బాబీ డైరెక్షపన్ లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య రిలీజ్ కు రెడీగా ఉన్న ఈమూవీ టీమ్ ఫస్ట్ టైమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రవితేజ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడిచారు మెగాస్టార్ చిరంజీవి. 

సంక్రాంతికి సందడి చేయబోతుంది వాల్తేరు వీరయ్య మూవీ. ఈ సందర్బంగా.. మీడియా ముందుకు వచ్చారు వాల్తేరు  టీమ్. ఈసందర్భంగా చాలా హుషారుగా మాట్లాడారు చిరంజీవి ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక ఇలా మాట్లాడుతూనే ఈసినిమా గురించి చాలా వరకూ చప్పేశారు మెగాస్టార్. ముఖ్యంగా రవితేజ పాత్ర గురించి అందరిలో క్యూరియాసిటీ ఉండేది. అయితే ఈపాత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాన్నిరివిల్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..సెకండ్ హాఫ్ లో వచ్చే రవితేజ పాత్ర చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అంటూ మాట్లాడాడు. 

అంతే కాదు ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరుగుతుందంటూ.. మరో హింట్ కూడా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యిందని. అయితే అందరిగురించి మాట్లాడిన మెగాస్టార్.. రవితేజ గురించి ఆఒక్క పాయింట్ మాత్రమే చెప్పారు. తరువాత మాస్ మహారాజ్ గురించి ఏం మాట్లాడలేదు. దాంతో ఈవెంట్ అయిపోయిన వెంటనే రవితేజ గురించి ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే  ఒప్పుకున్న రవికి చాలా కృతజ్ఞతలు. రవితేజ లేనిదే వీరయ్య కంప్లీట్ అవ్వదు. అంటూ ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి.

 

దీన్ని బట్టి ఫస్ట్ హాఫ్ అంతా మెగాస్టార్ దుమ్ము రేపి..సెకండ్ హాఫ్ నుంచి రవితేజ తో కలిసి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు మెగాస్టార్. నాకు గతంలో ఓ సీనియర్‌ హీరో చెప్పారు. మనల్ని తెరపై ఎలా చూపించాలో మనకంటే.. ఇక్కడున్న ప్రొఫెషనల్ రైటర్స్ కంటే.. మనల్ని అభిమానించే ఒక అభిమాని ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం అతను చూపించినట్టుగా ఎవరూ మనల్ని చూపించరు. ఒకవేళ అలాంటి అవకాశమొస్తే ఖచ్చితంగా చెయ్యి అని అన్నాడు. అది నాకు బలంగా గుర్తుండిపోయిందన్నారు.

బాబీ, వాళ్ల నాన్నగారు నాకు ఎంత వీరాభిమానులో తెలియజేసినపుడు నాకు ఎంతో ఆనందం వేసింది. అలాంటి అభిమాని బాబీ ఓ కథతో వచ్చాడంటే నేను ఊహించని విధంగా నన్ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తాడని బలమైన నమ్మకం. ఈ సినిమా గురించి ఎంతైనా ఊహించుకోండి.. దానికి మించే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ వాళ్ల బాధ్యతలను ప్రేమించి ఈ సినిమా చేశారన్నాడు చిరంజీవి.

ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్నప్రతీ ఒక్కరిని పేరు పేరున గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా లాస్ట బట్ నాట్ లీస్ట్ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. చలిలో శారీ కట్టుకొని డ్యాన్స్ చేయడమంటే చాలా కష్టం. ఆమె చాలా వణికిపోతూ ఉండేది. కానీ తెరపై అలాంటిదేమి కనిపించనీయకుండా చాలా బాగా మేనేజ్ చేసిందన్నారు చిరంజీవి. ఈక్రమంలో ఈప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఉంది..ఇంకా ఈవెంట్ ఎందుకు అని మెగాస్టార్ అనగా.. రవితేజ నాది కూడా అదే అభిప్రాయం అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేశారు. 

పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాకు  బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. శృతీ హాసన్ మెగాస్టార్ కు జతగా నటించింది. దేవిశ్రీ మ్యూజిక్ అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.  ఊర్వశీ రౌటేలా, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, ప్రవీణ్, షకలక శంకర్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?