హీరో సిద్థార్ధ్ కు ఎయిర్ పోర్ట్ లో ఘోర అవమానం, మండిపడిన తమిళ స్టార్ హీరో

By Mahesh JujjuriFirst Published Dec 27, 2022, 9:13 PM IST
Highlights

హీరో సిద్థార్థ్ కు ఘోర అవమానం ఎదురయ్యింది. అది కూడా తమ సొంత రాష్ట్రం తమిళనాడులో.. మధురై ఏయిర్ పోర్ట్ లో సీఆర్ పీ  సిబ్బంది సిద్ధార్థ్ ను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. 
 

తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని హీరో  సిద్దార్థ్‌.  ఫ్యాన్స్ లో క్రేజ్ తో పాటు..కాస్త వివాదం.. కాస్త చమత్కారం ఇలా అన్ని రకాలుగా కలిసి ఉన్న స్టార్ సిద్థార్ద్.  మాటలకు మాట ఇచ్చిపడేసే మనస్థత్వం ఆయనది. అందుకే టాలీవుడ్ కు చాలా కాలం దూరం అయ్యాడు సిద్థు. ఇక అలాంటి సిద్థార్ద్ కు  ఘోర అవమానం జరిగింది అది కూడా తన సొంత రాష్ట్రం తమిళనాడులో  మధురై ఎయిర్‌పోర్టులో సిద్థుకు  అవమానం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా అడ్డుకున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది.. అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారు. 

అసలు ఎందుకు వారు ఇలా తిడుతున్నారో అర్ధం కాక.. సిద్థార్ధ్ వారిని వారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇంగ్లిష్‌ లో మాట్లాడాలని వారిని ఎంతగా వేడుకున్నా వినకుండా మాటల దాడి చేశారంటూ సిద్థు ఆవేదన వ్యాక్తం చేశారు. ఇక ఈ ఘటనపై విమానాశ్రయంలో అధికారులకు సిద్దార్థ్‌ కంప్లైయింట్ కూడా చేశారు. తనకు జరిగిన ఈ అవమానానికి సబంధించి వివరాలను  సిద్థు  సోషల్‌ మీడియాలో  వెల్లడించారు. 

మంగళవారం మధ్యాహ్నం మధురై ఎయిర్‌పోర్టులో నటుడు సిద్దార్థ్‌ను సీఆర్‌పీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వెంట వృద్ధాప్యంలో ఉన్న సిద్దార్ధ్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తన తల్లిదండ్రుల జేబులు, బ్యాగుల్లో ఉన్న డబ్బును, ఇతర వస్తువులను బయటకు తీయాలంటూ.. సీఆర్ పీ వారు ఆర్డర్ధ్  వేశారు. అంతే కాదు అర్ధం కాకుండా  హిందీలో మాట్లాడుతూ సిద్థు ఫ్యామిలీని దుర్బాషలు ఆడారు. దాంతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని సిద్థు కోరినప్పటికీ వారు నిరాకరించారు.

20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులను సీఆర్‌పీ సిబ్బంది అవమానించారని, తనను కూడా వేధింపులకు గురిచేశారని సిద్దార్థ్‌ సోషల్‌ మీడియా లో  ఆరోపించారు. ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్న సీఆర్‌పీ సిబ్బంది.. ఎలాంటి పనిలేకుండా తమపై అధికారాన్ని ప్రదర్శించారని తనకు అనిపించిందని సిద్దార్థ్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సిద్దార్థ్‌ తెలిపారు.

click me!