ఓటీటీలో ‘రంగమార్తాండ’,రిజల్ట్ ఏంటంటే!

Published : Apr 09, 2023, 04:31 PM IST
ఓటీటీలో ‘రంగమార్తాండ’,రిజల్ట్ ఏంటంటే!

సారాంశం

ఓ రంగస్థల నటుడి జీవితానికి సంబంధించిన ఒక విభిన్న కోణంలో రంగమార్తాండలో ఆవిష్కరించారు రమ్యకృష్ణ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ భావోద్వేగాల డ్రామా ఓటిటితో ఒడ్డున పడింది.


ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. ఈ సినిమాతో కృష్ణవంశీ మళ్లీ అందరి ప్రశంసల్ని పొందిన సంగతి తెలిసిందే. రంగ మార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం అలాగే రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటించారు. మార్చి నెల 22న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటి స్ట్రీమింగ్ అవుతోంది. తెరపై పెద్దగా ఆదరణకు నోచుకోని ఈ చిత్రం ఓటిటిలో తెగ చూస్తున్నట్లు సమాచారం.  కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతోంది. ప‌లువురు పెద్దవాళ్లు  సైతం సినిమాను చూసి ద‌ర్శ‌కుడుకృష్ణ వంశీ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారని అప్రిషియేట్ చేస్తున్నారు.

రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వాళ్ళు కొనుగోలు చేసింది. ఓటిటి రేటు బాగా వచ్చిందని  పెట్టుబడిలో  80% వరకు రికవరీ చేసుకోగలిగారని వినికిడి.   ఈ రంగమార్తాండలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది మాస్ట్రో ఇళయరాజా సంగీతం. టాలీవుడ్ కు మ్యూజిక్ ఇవ్వడం బాగా తగ్గించేసిన ఇసై జ్ఞాని దీంతో మరోసారి తన మేజిక్ టచ్ ఇచ్చారు.  రెండోది మరాఠి సూపర్ హిట్ నట సామ్రాట్ కు ఇది అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ లో అద్భుతంగా మెప్పించిన నానా పాటేకర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రకాష్ రాజ్ ఇందులో ప్రాణ ప్రతిష్ట చేశారు. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు.ఓ రంగస్థల నటుడి జీవితానికి సంబంధించిన ఒక విభిన్న కోణంలో రంగమార్తాండలో ఆవిష్కరించారు రమ్యకృష్ణ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ భావోద్వేగాల డ్రామా ఓటిటితో ఒడ్డున పడింది.

వరస డిజాస్టర్లతో తన మార్కెట్ తో పాటు అవకాశాలను తగ్గించుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమా ఓటిటి టాక్ తో ఫామ్ లోకి వస్తాడంటున్నారు. 
సినిమా విడుదలైన దగ్గరి నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ రాకపోయేసరికి కృష్ణవంశీ డీలా పడ్డారు. అయితే ఈ సినిమాకి ప్రెజెంట్ ఓటిటిలో మంచి ఆదరణ లభించటం ఆనందం కలిగించే విషయం. ఈ క్రమంలో  చాలా సంవత్సరాలు తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాతో హిట్ సాధించి మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లుగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు మరి ఈ హిట్ ట్రాక్ ని ఇకపై కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ