'ఊ అంటావా మావ' అంటూ ఊపేస్తున్న విష్ణు ప్రియ.. సమంత ఐటెం సాంగ్ కి హాట్ డ్యాన్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 17, 2021, 12:05 PM IST
'ఊ అంటావా మావ' అంటూ ఊపేస్తున్న విష్ణు ప్రియ.. సమంత ఐటెం సాంగ్ కి హాట్ డ్యాన్స్

సారాంశం

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లో సందడి షురూ చేసింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లో సందడి షురూ చేసింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ గెటప్, రష్మిక గ్లామర్, ఎర్రచందనం  కథా నేపథ్యంతో పాటు సమంత ఐటెం సాంగ్ కూడా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. 

థియేటర్స్ లో కూడా Samantha ఐటెం సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతోంది. సమంత తొలిసారి నటించిన ఐటెం సాంగ్ కావడంతో విపరీతమైన హైప్ నెలకొంది. అందుకు తగ్గట్లుగానే దేవిశ్రీ మంచి బీట్ తో  కంపోజ్ చేశారు. మంగ్లీ సోదరి ఇంద్రావతి మత్తెక్కించే వాయిస్ తో అద్భుతమైన గాత్రం అందించింది. 

ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. యంగ్ యాంకర్ Vishnupriya సమంత ఐటెం సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ కి తాను డాన్స్ చేసిన వీడియోని విష్ణు ప్రియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విష్ణు ప్రియా తన నడుము అందాలు ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేసే విధంగా ఉంది. 

 

విష్ణు ప్రియా టాలీవుడ్ లో యాంకర్ గా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియా తరచుగా తన హాట్ ఫోటోస్, డ్యాన్స్ వీడియోల్ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. సమంత ఐటెం సాంగ్ ట్రెండింగ్ లో ఉండడంతో విష్ణు ప్రియా ఆ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. 

తరచుగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ విష్ణు ప్రియా కుర్రాళ్ళని హీటెక్కిస్తూ ఉంటుంది. సమంత తొలిసారి చేసిన ఈ ఐటెం సాంగ్ కి థియేటర్స్ లో టాప్ లేచిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ కష్టం అసమానమైనది.. పుష్ప రిలీజ్ సందర్భంగా రాంచరణ్ విషెస్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు