తేజకు హీరో దొరికేశాడు!

Published : May 08, 2018, 11:40 AM IST
తేజకు హీరో దొరికేశాడు!

సారాంశం

తాజాగా హీరో రానా.. తేజతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం

దర్శకుడు తేజ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదే జోరుతో వెంకీ సినిమాను సెట్ చేశాడు. సినిమాలో వెంకీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది. దానికి కారణం తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయడానికి అంగీకరించడమే. పోనీ ఆ సినిమా అయినా ఉందా అంటే అదీ లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే స్థాయి నాకు లేదంటూ సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో రెండు ప్రాజెక్టులు చేజారాయి. ఇక తేజకు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. నాగార్జునతో సినిమా చేయనున్నాడనే మాటలు వినిపించాయి.

కానీ దీనిలో ఎంతవరకు నిజముందో తేలాల్సివుంది. తాజాగా హీరో రానా.. తేజతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇటీవల రానాను కలిసి కథ వినిపించాడట తేజ. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ కు సంబంధించిన కథతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో రానా 'ఘాజీ' వంటి వైవిధ్యభరిత చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి అటువంటి విభిన్నమైన సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం రానా 'మదై తిరంతు','హతి మేరే సాతి'వంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత తేజతో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి  

PREV
click me!

Recommended Stories

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూసి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటికి మైండ్ బ్లాక్.. అయినా తప్పులో కాలేసింది
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని కూతురిని చూశారా? అందంలో అమ్మ పోలికే