వెన్నెల ప్రేమ కథనం.. `కోలు కోలు కోలమ్మ కోలు.. `.. దూసుకుపోతున్న `విరాటపర్వం` సాంగ్‌

Published : Feb 25, 2021, 04:34 PM IST
వెన్నెల ప్రేమ కథనం.. `కోలు కోలు కోలమ్మ కోలు.. `.. దూసుకుపోతున్న `విరాటపర్వం` సాంగ్‌

సారాంశం

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విప్లవాత్మక చిత్రమిది. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేశారు. 

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విప్లవాత్మక చిత్రమిది. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేశారు. 

`కోలు కోలు కోలమ్మ కోలు.. ` అంటూ సాగే జానపద పాటని విక్టరీ వెంకటేష్‌ గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పటికే తన మైండ్‌లో ఈ పాట స్ట్రక్‌ అయిపోయిందని ఈ సందర్భంగా వెంకీ తెలియజేయడం విశేషం. ఇక దర్శకుడు పాట విడుదల సందర్భంగా చెబుతూ, `స్త్రీ ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందిస్తుంది. ఈ రోజు `కోలు కోలు..` పాట ద్వారా వెన్నెల ప్రేమ కథనం` అని పేర్కొన్నారు. 

ఆద్యంతం జానపద పాట తరహాలో స్టో మోషన్‌లో అద్భుతమైన ప్రకృతి లొకేషన్లతో సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వినసొంపుగా ఉంది. ఇందులో వెన్నెల పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి పాడుతున్నట్టుగా ఈ పాట సాగడం విశేషం. ఇందులో సాయిపల్లవి చిత్రాలు కట్టిసడేస్తున్నాయి. అడవి, పల్లెలు, పల్లెటూరి పిల్ల ఇలా ప్రకృతి రమణీయతకు అద్దం పట్టిందీ పాట. అదే సమయంలో చైతన్యం నింపేలా ఉంది. ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, దివ్య మాలికా, సురేష్‌ బొబ్బిలి ఆలపించారు. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించారు.

నక్సల్‌ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 30న విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది