‘ఉప్పెన’ హీరో షాకింగ్ రెమ్యునేషన్

By Surya Prakash  |  First Published Feb 25, 2021, 1:58 PM IST


మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్  అందుకున్న ఈ మూవీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సామాన్యూలు కాక సినిమావాళ్లంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే  బాలయ్య,మహేష్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో వైష్ణవ్‌తేజ్‌ ఇండస్ట్రీకు హాట్ ప్రాపర్టీగా మారారు.   


మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్  అందుకున్న ఈ మూవీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సామాన్యూలు కాక సినిమావాళ్లంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే  బాలయ్య,మహేష్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో వైష్ణవ్‌తేజ్‌ ఇండస్ట్రీకు హాట్ ప్రాపర్టీగా మారారు.  దానికి తోడు మెగా కాంపౌండ్ హీరో. ఈ క్రమంలో తను తదుపరి సినిమాకు బాగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే క్రిష్‌ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నారని సమాచారం. అలాగే తన తొలి సినిమా ఉప్పెనకు కు రూ.50 లక్షలు తీసుకున్నాడని అంటున్నారు.

ఈ చిత్రం మొదటి రోజే రికార్డు స్టాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది.  మరో ప్రక్క  ప్రస్తుతం ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్‌ అయిన సమయంలో రెండు మూడు వారాల్లోనే ఉప్పెన డిజిటల్‌లోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా 40 నుంచి 60 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా సినిమాలతో పోలీస్తే ఉప్పెన కాస్త ఆలస్యంగానే ఓటిటిలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

Latest Videos

ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నదని ఒకవైపు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఏప్రిల్‌ 11 నుంచి దర్శనం ఇవ్వనుందని మరోవైపు వినికిడి. ఈ రెండింటిలో ఏది వాస్తవమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక విడుదలకు ముందే పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఉప్పెన మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, ఆహా సంస్థలు కూడా పోటీ పడగా.. నెట్ ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

click me!