అన్నపూర్ణాలో ఈ రోజు : ఎన్టీఆర్ ని డైరక్ట్ చేస్తున్న త్రివిక్రమ్

By Surya Prakash  |  First Published Feb 25, 2021, 1:40 PM IST

ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ని డైరక్ట్ చేస్తూ హడావిడిగా ఉన్నారు. అదేంటి ఇంకా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాలేదు కదా అంటారా.అయితే మీరు ఊహించింది కరెక్టే... ఎన్టీఆర్ తో ఓ ప్రోమోకు సంభందించిన షూట్ చేస్తున్నారు త్రివిక్రమ్. త్వరలో ఆ ప్రోమో జెమెనీ టీవిలో టెలీకాస్ట్ కానుంది. ఇంతకీ దేని గురించి ఆ ప్రోమో అంటారా...
 
ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్నారన్న  సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మే నుంచి టెలికాస్ట్ కానుంది. ఈ క్రమంలో ఈ షోకు సంబందించిన పబ్లిసిటికు తెర తీస్తోంది టీవి యాజమాన్యం. ఒకటి రెండు నెలలు ముందుగా ఈ కార్యక్రమానికి పబ్లిసిటీ అవసరం కాబట్టి అందుకోసం ప్రోమోలు రూపొందించే పని ప్రారంభమైంది.

Latest Videos

ఈ మేరకు ఈ రోజు ఒక యాడ్ ను షూట్ చేస్తున్నారు. ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ ఈ యాడ్ షూట్ లో పాల్గోన్నారు. స్టార్ సంస్థ ఇచ్చిన ఐడియాను కాన్సెప్ట్ గా మార్చి, తన స్టయిల్ లో త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ లో జరిగిన షూట్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు కు వున్న స్టాండర్ట్ గెటప్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ యాడ్ ను మార్చి చివరిలో విడుదల చేసే అవకాశం వుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ అని అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ యాడ్ తోనే ఆ ప్రకటన రావచ్చు అని క్లారిటీ వచ్చింది.
 
click me!