రానా, నితిన్ లు తగ్గరు, బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ లు అసలు తగ్గట్లేదు

Published : Aug 07, 2017, 06:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రానా, నితిన్ లు తగ్గరు, బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ లు అసలు తగ్గట్లేదు

సారాంశం

ఆగస్టు 11న భారీ సినిమాల మధ్య యుద్ధం ఒకే రోజున రానా నేనే రాజు నేనే మంత్రి, నితిన్ లై, బెల్లంకొండ శ్రీనివాస్ జయజానకి నాయక రిలీజ్ ముక్కణపు పోటీలో రానా, నితిన్ వున్నా తగ్గేది లేదంటున్న బోయపాటి, బెల్లంకొండ టీమ్

బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల ‘జయజానకి నాయక’ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గారని తెలుస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘జయజానకి నాయక’ మూవీ ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ అదే రోజున బాక్సాఫీస్ బరిలో మరో రెండు పెద్ద సినిమాలు ఉండటంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగష్టు10న ‘జయజానకి నాయక’ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.



వరుస సెలవులు కావడంతో క్యాష్ చేసుకోవడానికి ఆగస్ట్ 11న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. రానా 'నేనే రాజు నేనే మంత్రి', బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక', నితిన్ 'లై' సినిమాలు అదే రోజున బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో ఇప్పుడు ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూడు సినిమాల్లో ఏది లాభాల పంట పండిస్తుంది, దేనికి పంగనామాలు పడతాయి అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

 


అయితే ఈ మూడు సినిమాలు ఒకేరోజు రావడం కంటే కనీసం ఒక సినిమా ఒకరోజు ముందు అంటే ఆగస్ట్ 10న వస్తే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకుల భావన. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు 'జయ జానకి నాయక' సినిమాను ఆగస్ట్ 10న విడుదల చేయాల్సిందిగా బయ్యర్లు బోయపాటిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కనీసం ఒకరోజు ముందుగా విడుదల చేస్తే కలెక్షన్స్ పరంగా అడ్వాంటేజ్ అవుతుందని బయ్యర్లు.. బోయపాటి, నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

 


మూడు సినిమాలు ఒకేరోజు విడుదలైతే దేనికి కేటాయించిన థియేటర్లలో ఆ సినిమా విడుదల చేయాలి. అలా కాకుండా ఒకరోజు ముందుగా వస్తే వీలైనన్ని థియేటర్లలో సినిమా విడుదల చేసి క్యాష్ చేసుకోవచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ‘జయజానకి నాయక’ మూవీని ఒకరోజు ముందుగానే థియేటర్స్‌లోకి తీసుకువచ్చే బయ్యర్ల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది .  బోయపాటి కాస్త బెట్టు చేస్తున్నా.. బెల్లంకొండ బయ్యర్ల ఐడియాకు రెస్పెక్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే తగ్గేది లేదని బోయపాటి తేల్చి చెప్తున్న నేపథ్యంలో పదో తేదీ ప్రీమియర్ బెనిఫిట్ షోలు వేసి కలెక్షన్స్ కోసం ఆలోచిస్తున్నారట. కానీ రిలీజ్ 11నే అనేలా వుండాలని జయజానకి టీమ్ లీడర్ బోయపాటి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా బయ్యర్లతో తీవ్రంగా చర్చిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనేది త్వరలో తెలియనుంది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?