ఆసక్తి కరంగా రానా నాయుడు ట్రైలర్, అదరగొట్టిన బాబాయి వెంకటేష్, అబ్బాయి రానా

Published : Feb 15, 2023, 10:46 PM IST
ఆసక్తి కరంగా రానా నాయుడు ట్రైలర్, అదరగొట్టిన బాబాయి వెంకటేష్, అబ్బాయి రానా

సారాంశం

ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు  వెంకటేష్, రానా. తండ్రీ కొడుకులుగా వీరు నటిస్తున్న సిరీస్ రానా నాయుడు స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈక్రమంలోనే ఈ వెబ్ మూవీ నుంచి అదరిపోయే ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. 


దగ్గుబాటివారి బాబాయ్ అబ్బాయి.. రానా దగ్గుబాటి,  వెంకటేష్ దగ్గుబాటి మొదటిసారిగా తండ్రీకొడుకుల పాత్రల్లో కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.  హై-ఆక్టేన్, యాక్షన్-స్టోరీతో తెరకెక్కిన ఈ సిరీస్... ఫేమస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు రీమేక్ గా తెరకెక్కింది.  రానా నాయుడు ప్రీమియర్ మార్చి 10, 2023న నెట్ ఫ్లిక్స్ లో అవ్వబోతోంది.  కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ ట్రైలర్ లో వెంకీ, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా కీలకపాత్రలలో నటిస్తున్నారు. కాగా,  తండ్రీకొడుకుల మధ్య జరిగే సంఘర్షన ఆధారంగా ఈవెబ్ సిరీస్ తెరకెక్కినట్టుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.  ఉత్కంఠ భరితంగా సాగిన  రానా నాయుడు ట్రైలర్ లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ తో అదరగోట్టారు. ముఖ్యంగా తండ్రీ కొడుకులుగా వెంకటేష్, రానా పాత్రలు ట్రైలర్ లోనే ఇంట్రెస్ట్ నుక్రియేట్ చేశాయి. సిరీస్ పై అంచనాలను పెంచేశాయి. 

 

 ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రానా సెంటిమెంట్ తో పాటు స్టైలిష్ లుక్ లోకనిపిస్తూనే..  యాక్షన్ సీన్స్  అదరగొట్టాడు. ఇందులో నాగ నాయుడుగా నటించిన వెంకటేష్ అంతకు మించి అన్నట్టు అదరగొట్టారు.  వయసు పైబడిన లుక్ లో వెంకీ.. ఎమోషన్స్ తో పాటు అంతే బోల్డ్ గా నటించి మెప్పించాడు. . రానా – వెంకీల మధ్య ట్విస్టులు బాగున్నాయి. మొత్తానికి రానా నాయుడు ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. 

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా