హిరణ్య కశిప.. ఆలస్యమెందుకంటే?

By Prashanth MFirst Published Jun 6, 2019, 9:51 AM IST
Highlights

50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సురేష్ ప్రొడక్షన్ నుంచి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. సంస్థ సృష్టికర్త రామానాయుడు నిర్మాతగా చెరగని ముద్ర వేసుకొని గిన్నిస్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. అయితే సంస్థ నుంచి ఒక భారీ బడ్జెట్ చిత్రం ఇంతవరకు రాలేదు. 

త్వరలోనే హిరణ్య కశిప సినిమా ద్వారా ఆ లోటును మాయం చేయాలనీ సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా 100 మంది టెక్నీషియన్స్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. 

సినిమా చరిత్రలో నిలిచిపోవాలని చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే సినిమా తెరపైకి రావడానికి ఆలస్యమవుతోంది. పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ సెట్ చేసుకున్న తరువాతే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. 

ఇప్పటికే గ్రాఫిక్స్ కి సంబందించిన ప్లాన్ సిద్దమైనట్లు సమాచారం. బారి సెట్స్ పై కూడా చిత్ర యూనిట్ ఒక అవగాహనకు వచ్చింది. ఈ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. ఫొటోగ్రఫీ బ్లాక్స్ నుంచి సీన్ టూ సీన్ స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా వచ్చే వరకు షూటింగ్ స్టార్ట్ అయ్యే వీలు లేదని ఈ ఇటీవల నిర్మాత సురేష్ బాబు తెలియజేశారు. 

click me!