సెక్యురిటీ గార్డ్ చెంప పగలగొట్టిన సల్మాన్ ఖాన్!

Published : Jun 06, 2019, 09:38 AM IST
సెక్యురిటీ గార్డ్ చెంప పగలగొట్టిన సల్మాన్ ఖాన్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. అందరిముందు అతడి చెంప పగలగొట్టారు. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. అందరిముందు అతడి చెంప పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమా ప్రమోషన్స్ కోసం ముంబైలోని ఓ మాల్ లో జరిగిన కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లారు.

కారు దిగి లోపలకి వెళ్తుండగా.. అభిమానులు చుట్టుముట్టారు. వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. సల్మాన్ ని చూడడానికి అతడు కూడా ప్రయత్నించాడు. ఈ క్రమంలో సల్మాన్ సెక్యురిటీ గార్డ్ లలో ఒకరు ఆ బాలుడ్ని పక్కకు తోసేశారు. 

ఇది గమనించిన సల్మాన్ కి సెక్యురిటీ గార్డ్ పై కోపం వచ్చింది. వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించాడు. సల్మాన్ దెబ్బకి షాక్ తిన్న సెక్యురిటీ గార్డ్ అక్కడ నుండి పక్కకు జరిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు కొందరు సల్మాన్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు అతడిని తిట్టిపోస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. రంజాన్ కానుకగా విడుదలైన 'భారత్'కి మిశ్రమ స్పందన లభిస్తోంది.  

 

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ 15వ రోజు కలెక్షన్స్, ప్రభాస్ సినిమా ఎన్ని లక్షలు వసూలు చేసిందంటే?
4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?