
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఘాజీ. రానా దగ్గుబాటి హీరోగా... రానా, తాప్సీ కేకే మీనన్, అతుల్ కుల్ కర్ణి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ట్రయలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. ఫిబ్రవరి 17న 11వ తేదీ నుండి ఘాజీ ట్రయలర్ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ లలో హల్ చల్ చేయనుంది.
ఘాజీ సినిమాలో సముద్రం లోపల జరిగే యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ హాలీవుడ్ స్థాయిలో టెక్నాలజీ వినియోగించి తెరకెక్కించామని నిర్మాతలు చెప్తున్నారు. 1971 ఇండో పాక్ యుద్ధం ఆధారంగా సంకల్ప్ ఈ మూవీ కథ రూపొందించారు. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ఇవా మోషన్ స్టూడియోస్ సంస్థ అందిస్తోంది.