ఖైదీ, గౌతమిపుత్ర లకు విషెస్ చెప్పిన విక్టరీ

Published : Jan 09, 2017, 02:34 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఖైదీ, గౌతమిపుత్ర లకు విషెస్ చెప్పిన విక్టరీ

సారాంశం

సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న మెగాస్టార్, బాలయ్య సినిమాలు ఖైదీ నెంబర్ 150 జనవరి 11న, గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి 12న రిలీజ్ మిత్రులకు శుభాకాంక్షలు అంటూ చిరు,బాలయ్యలకు విషెస్ చెప్పిన వెంకీ

సంక్రాంతి బరిలో తెలుగు వెండితెరపై నువ్వా నేనా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. ఈ సంక్రాంతికి జనవరి 11న చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతుండగా.. 12న బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతోంది. చిరు, బాలయ్య సినిమాలతో సంక్రాంతి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

 

తెలుగునాట ఎవరి నోట విన్నా ఈ రెండు సినిమాల గురించిన ప్రస్తావనే. ఇప్పటికే ఈ సినిమాల విడుదలకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా సినిమాల విడుదలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

అభిమానులంతా ఎంత ఆశగా తమ హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తున్నారో అదే మాదిరిగా తాను కూడా ఈ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నానన్నారు విక్టరీ వెంకటేష్. కొన్నేళ్ల క్రితం వరకు సంక్రాంతి బరిలో ఆనలుగురి సినిమాలు రిలీజయ్యేవి. అందులో... నువ్వా నేనా అంటూ వెంకీ కూడా బరిలో ఉండేవారు. ఈ సంక్రాంతికి మాత్రం తన తోటి నటుల చిత్రాలపై స్పందించిన వెంకీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

 

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు, బాలకృష్ణ సినిమాలపై సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ లో స్పందించారు. ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాల హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి దిగిన పాత ఫోటోను పోస్ట్ చేసిన వెంకీ.. ‘‘ఇద్దరు గొప్ప నటులు, నా స్నేహితులు బాలకృష్ణ, చిరంజీవి సినిమాల కోసం ఎంతగానో వేచి చూస్తున్నా. ఈ రెండు సినిమాల వల్ల ఈసారి సంక్రాంతి ఘనంగా జరగబోతుంది. వీరిద్దరిని స్క్రీన్ మీద చూడడానికి తహతహలాడుతున్నా. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా రెండు సినిమాల చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Puri Jagannadh: ఆ హీరోయిన్ తో పూరి జగన్నాధ్ కి 6 ఫ్లాపులు.. ఆమెపై ఊహించని కామెంట్స్ వైరల్
Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు