హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు రెడీ అయిన రానా దగ్గుబాటి

Published : Sep 17, 2017, 07:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు రెడీ  అయిన రానా దగ్గుబాటి

సారాంశం

లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రానా బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజీ స్టార్ గా మారిన రానా వరుస విజయాలతో దూసుకెళ్తున్న రానా హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్

జక్కన్న తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు రానా. మూవీ మొఘల్ రామానాయుడు మనవడిగా... స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు రానా ‘లీడర్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే హీరోగా ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించినా రానా కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి సిరీస్ లో ప్రతినాయకుడుగా రానా కి  జాతీయ స్థాయిలో మంచి పేరు..గుర్తింపు వచ్చింది.  

 

ఈ మద్య తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అంతకు ముందు ఘాజీ సినిమాతో మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యారీ కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే రానా మొదటి నుంచి సినిమా క్యారెక్టర్లపైనే దృష్టిపెడుతూ..తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

 తాజాగా రానాకి మరో అదృష్టం వచింది. త్వరలో ఒక హాలీవుడ్ మూవీ చేయనున్నారు.. ఈ సినిమాకి 'విజిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక చిత్రం విషయానికి వస్తే..1888వ సంవత్సరంలో 700 మంది ప్రయాణికులతో ఓ భారీ ఓడ సౌరాష్ట్ర నుంచి బయలుదేరింది.

 

అలా బయలుదేరిన కొన్ని రోజులకు అది అదృశ్యమైంది. ఆ ఓడ ఏమైంది? దాని అదృశ్యానికి గల కారణాలేంటనే విషయాలపై పరిశోధన చేసే సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించనున్నాడు.   మొత్తానికి తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు రానా హాలీవుడ్ లో కూడా కనిపించడంపై అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్