దసరా రేసులో ఎన్టీఆర్,మహేష్ లకు శర్వానంద్ ట్విస్ట్

Published : Sep 17, 2017, 05:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
దసరా రేసులో ఎన్టీఆర్,మహేష్ లకు శర్వానంద్ ట్విస్ట్

సారాంశం

మహానుభావుడు ఆడియోలో పాటలకు మంచచి స్పందన దసరా రేసులో మహేష్, ఎన్టీఆర్ లతో పోటీ పడుతున్న శర్వానంద్ జైలవకుశ, స్పైడర్ లతో పాటు ఈ దసరా సీజన్ లో మహానుభావుడు

జైలవకుశ,స్పైడర్ సినిమాలతో ఈ దసరా బాక్సాఫీస్ రేస్ మాంచి రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే జూనియర్ మహేష్ ల ఆధిపత్య పోరుగా మారిపోవడంతో ‘జై లవ కుశ’ ‘స్పైడర్’ సినిమాల రిజల్ట్ గురించి ఫిలిం ఇండస్ట్రీతో పాటు వాళ్ల అభిమానులు కూడా ఫలితం కోసం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ వార్ ఫైనల్ రిజల్ట్ లో మేం టాప్ అంటే మేం టాప్ అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో శర్వానంద్ కు సంబంధించిన ‘మహానుభావుడు’ మూవీ విడుదల కాకుండానే మహేష్ జూనియర్ ల సినిమాల పై మొదటి విజయాన్ని విడుదల కాకుండానే నమోదు చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 

ఓపక్క దసరా రేస్ లో మహేష్, ఎన్టీఆర్ లు పోటీ పడుతుంటే శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమా విడుదల అవ్వడం ఒక ఆశ్చర్యం  అయితే ఈసినిమా ఆడియోకు వస్తున్న స్పందన మరింత సర్ ప్రైజ్ ఇస్తోంది. ఈమధ్య కాలంలో ఇమేజ్ ని పోగొట్టుకున్న ఎస్.ఎస్. థమన్.. మ్యూజిక్ అందించిన ‘మహానుభావుడు’ పాటలకు మంచి స్పందన రావడమే కాకుండా ఆ పాటలు యూత్ కు బాగా కనెక్ట్ కావడం అత్యంత సంచలనంగా మారింది.

 

దీనితో ‘జై లవ కుశ’ ‘స్పైడర్’ సినిమాల ఆడియోల కంటే ‘మహానుభావుడు’ పాటలు బాగున్నాయి అన్న కామెంట్స్ రావడం జూనియర్ మహేష్ సినిమాలను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దీనికితోడు ఇప్పటికే సంక్రాంతి పండుగ హీరోగా రెండు సార్లు తన సత్తాను చాటుకున్న శర్వానంద్ ఈసారి దసరా హీరోగా కూడ మారిపోతాడా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.

 

ఇది ఇలా ఉండగా మొత్తం 6 పాటలు ఉన్న ‘మహానుభావుడు’ ఆడియో ఆల్బంలో అన్ని పాటలు వినసొంపుగా ఉండటం అందరికీ షాక్ ఇచ్చే విషయంగా మారింది. దీనితో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అవుతున్న ‘మహానుభావుడు’ షాక్ మహేష్ జూనియర్ లకు ఎంతోకొంత స్థాయిలో తగులుతుందా అన్న విషయమై ఊహాగానాలు మొదలు అయిపోయాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల ఊహించని ఘన విజయాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్న నేపధ్యంలో ఈ మహానుభావుడు ఎటువంటి షాక్ ను ఇస్తుంది అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?