రానా హిరణ్యకశ్యపుడిగా చిత్రం తెరకెక్కించేందుకు గత కోనేళ్ళుగా తెరవెనుక వర్క్ జరుగుతూనే ఉంది. చూస్తుంటే ఈ చిత్ర పనులు మరింత వేగం పుంజుకున్నట్లు అర్థం అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తోంది.
రానా హిరణ్యకశ్యపుడిగా చిత్రం తెరకెక్కించేందుకు గత కోనేళ్ళుగా తెరవెనుక వర్క్ జరుగుతూనే ఉంది. గుణశేఖర్ దాదాపు ఈ చిత్రం కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. కానీ ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే కొంత కాలం నుంచి హిరణ్య కశ్యప ఆగిపోయిందని.. గుణశేఖర్, రానా కాంబినేషన్ లో ఆ చిత్రం రావడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ రానా ఇటీవల కామిక్ కాన్ లో హిరణ్య కశ్యప ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
చూస్తుంటే ఈ చిత్ర పనులు మరింత వేగం పుంజుకున్నట్లు అర్థం అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తోంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని ఆసక్తికర కోణంలో ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ ని రానా రిలీజ్ చేశారు.
హిరణ్య కశ్యపుడి కథని కార్టూన్ రూపంలో ఉన్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో అనేక అంశాలు ఉన్నాయి. రానా హిరణ్యకశ్యపుడిగా డెడ్లీ లుక్ ఎలా ఉండబోతోంది ? అసలు హిరణ్య కశ్యపుడు కఠోరమైన తపస్సు ఎందుకు చేశాడు? ఈ తరహాలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు అర్థం అవుతోంది.
కాన్సెప్ట్ టీజర్ లో 'కాబట్టే అతడు కఠోరమైన తపస్సు మొదలు పెట్టాడు' అనే లైన్ ఉన్న కార్టూన్ పిక్చర్ ఉంది. ఈ కాన్సెప్ట్ టీజర్ కి రానా ' రాక్షస రాజు ఆగమనం' అని క్యాప్షన్ ఇచ్చారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు కూడా రానా ప్రకటించారు. హిరణ్య కశ్యపుడు రాక్షస రాజు కాబట్టి ఆ తరహా డెడ్లీ లుక్ ఉండేలా రానా బాడీ ట్రాన్ఫర్ మేషన్ కోసం కసరత్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు.. మరి దర్శకుడు ఎవరు అనే క్లారిటీ ఇంకా రాలేదు. అయితే ఈ చిత్రానికి మరో సమస్య కూడా పొంచి ఉంది. తాను రూపొందించిన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఊరుకోను అంటూ ఆల్రెడీ డైరెక్టర్ గుణశేఖర్ హెచ్చరించారు. మరి త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారో వేచి చూడాలి. కాన్సెప్ట్ టీజర్ మాత్రం ఈ చిత్రంపై ఆరంభంలో ఆసక్తిని పెంచేసింది.