
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈరోజు (డిసెంబర్ 14న) తన 38వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘రానా నాయుడు’ సిరీస్ తర్వాత ఏ ప్రాజెక్ట్ లో నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇవ్వాళ బర్త్ డే సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. డైరెక్టర్ తేజా దర్శకత్వంలోనే మరోసారి రానా దగ్గుబాటి నటిస్తుండటం విశేషంగా మారింది. ఈరోజు రానా పుట్టిన రోజు కావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి టైటిల్, రానా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
రానా - తేజా కాంబోలో మరోసారి రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘రాక్షస రాజా’ (Rakshasa Raja) అనే టైటిల్ ను ఖరారు చేశారు. హై-ఆక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం, దర్శకుడు తేజతో రానా మళ్లీ కలిశాడు. వీరిద్దరు గతంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రానికి కలిసి పనిచేశారు. రాక్షస రాజా ప్రాజెక్ట్ గతంలోనే మొదలైంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత అచంట గోపీనాథ్ నిర్మించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి రానా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరోసారి పొలిటికల్ అండ్, యాక్షన్ డ్రామాతో తేజా మ్యాజిక్ చేయబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. పోస్టర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో.. రానా తన భుజంపై భారీ తుపాకీని పట్టుకుని మరో వైపు బుల్లెట్‌తో కనిపిస్తున్నాడు. విభూతి మరియు తిలకం ధరించి, నోటిలో సిగార్‌తో క్రూరంగా కనిపించారు. ఆడియెన్స్ కు పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.