#Animal ఓటిటీలో డిలేట్ చేసిన ఆ కిస్ సీన్ ఉంటుంది

By Surya PrakashFirst Published Dec 14, 2023, 12:46 PM IST
Highlights

అతడు నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్యా ఓ కిస్ ఉంది. కానీ అతడు ఆ సీన్ డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు

 
రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. ‘అర్జున్‌ రెడ్డి’ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తన్న సంగతి తెలిసిందే.  తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం భాక్సాపీస్ కు షాక్ ఇస్తూ ఓ స్దాయిలో అదరకొడుతోంది. ఈ చిత్రంలో  పాత్రలు, సన్నివేశాలను విమర్శించిన వారూ ఉన్నారు. అవేమీ సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపెట్టలేదు. ఆ విషయం ప్రక్కన పెడితే... ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 లేదా 15 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజవుతోందని సమాచారం. అంతేకాదు థియేటర్లలో డిలీట్ చేసిన ఓ సీన్ ను కూడా ఓటీటీలో చేర్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ఈ  చిత్రం ప్రమోషన్ లో భాగంగా బాబీ డయోల్ ఈ విషయం  చెప్పుకొచ్చారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ పాత్రకు, తన పాత్రకు మధ్య సినిమాలో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చారు. బాబీ డయోల్ మాట్లాడుతూ...  "క్లైమ్యాక్స్ ఫైట్ లో ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ప్రేమ కూడా ఉంది. అందుకే క్లైమ్యాక్స్ ఫైట్ లో బ్యాక్‌గ్రౌండ్ లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారు.  బీ ప్రాక్ పాడిన దునియా జలా దేంగే అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. నిజానికి తమ పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉందని బాబీ వెల్లడించాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ సీన్ తనకు ఎలా వివరించాడో బాబీ చెప్పాడు.

Latest Videos

 "మీరు ఫైట్ చేస్తూ ఉంటారు.. నువ్వు సడెన్ గా కిస్ చేస్తావు. అయినా వదిలి పెట్టవు. అతడు నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్యా ఓ కిస్ ఉంది. కానీ అతడు ఆ సీన్ డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు" అని బాబీ డియోల్ చెప్పాడు.

మరో ప్రక్క సినిమాపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌, తాను నటించిన వైవాహిక అత్యాచారం సన్నివేశంపై వచ్చిన ట్రోల్స్‌పై నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol) స్పందించారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాము వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయలేదని, పాత్ర డిమాండ్‌ మేరకు ఆ సీన్‌ పెట్టాల్సి వచ్చిందన్నారు. తాను పోషించిన అబ్రార్‌ హక్‌ పాత్ర నిడివి తక్కువని, ఉన్న సమయంలోనే క్యారెక్టర్‌ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థంకావాలంటే అలాంటి సీన్స్‌ క్రియేట్‌ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
 
ఇక ‘‘సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప వాటిని సినిమాలు ప్రమోట్‌ చేయట్లేదు. పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకుని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. అలా చేసి ఉండకపోతే ‘యానిమల్‌’ ఇంత పెద్ద హిట్‌ అయి ఉండేది కాదు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.  

click me!