రానా, మిహీక తల్లిదండ్రులు కాబోతున్నారా.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్ ?

By team teluguFirst Published Oct 26, 2022, 5:39 PM IST
Highlights

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది.

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది. బాహుబలిలో భల్లాల దేవుడిగా రానా నటన అద్భుతం. ఇక ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో రానా సక్సెస్ అందుకున్నాడు. 

2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రానా, మిహీక గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది.   

రానా, మిహీక త్వరలో తల్లి తండ్రులు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిహీక ప్రస్తుతం గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో దగ్గుబాటి వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతోంది అని అంటున్నారు. రానా, మిహీక లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. 

మిహీక గర్భవతి కావడంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు. ఇటీవల రానా సోషల్ మీడియా పోస్ట్ లు డిలీట్ చేస్తూ.. కొన్ని రోజుల పాటు తాను సామజిక మధ్యమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 

దీనితో రానా, మిహీకా మధ్య విభేదాలు తలెత్తినట్లు రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ ని పటాపంచలు చేస్తూ మెహీక ఇటీవల కార్వా చౌత్ సందర్భంగా పోస్ట్ పెట్టింది. రానా, మిహీక ఇద్దరూ చేతిలో చేయి పట్టుకుని రింగ్స్ చూపిస్తున్న పిక్ వైరల్ అయింది. 

సినిమాల విషయానికి వస్తే రానా ప్రస్తుతం తన బాబాయ్ వెంకటేష్ తో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా చివరగా విరాట పర్వం చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miheeka Daggubati (@miheeka)

click me!