కాలేజీ రోజుల్లోనే ఊపేసిన సాయి పల్లవి... ఓల్డ్ వీడియో వైరల్, డాన్స్ ఎలా చేసిందో చూడండి!

By Sambi ReddyFirst Published Apr 17, 2024, 7:17 AM IST
Highlights

సాయి పల్లవి గొప్ప నటి... అంతకు మించి డాన్సర్. కాగా సాయి పల్లవి కాలేజ్ రోజుల్లో వేదిక మీద ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కత్రినా కైఫ్ నటించిన 'షీలా కీ జవానీ' సాంగ్ కి అద్భుతమైన స్టెప్స్ తో ఊపేసింది.  ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. 
 


ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి బెస్ట్ డాన్సర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీనేజ్ నుండే పలు డాన్స్ షోలలో సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సాయి పల్లవి నటించిన 'వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే', 'రౌడీ బేబీ', 'సారంగదరియా' పాటల్లో సాయి పల్లవి డాన్స్ అద్భుతం అని చెప్పాలి. సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టిన అంశాల్లో డాన్స్ కూడా ఒకటి. 

కాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తీస్ మార్ ఖాన్ చిత్రంలో కత్రినా కైఫ్ చేసిన 'షీలా కీ జవానీ' సాంగ్ అత్యంత పాప్యులర్. ఈ సాంగ్ కి సాయి పల్లవి తన ఫ్రెండ్స్ తో పాటు డాన్స్ చేసింది. సాయి పల్లవి ఎనర్జీ, మెస్మరైజింగ్ స్టెప్స్, గ్రేస్ మైమరిపించేలా ఉన్నాయి. 

ఈ ఓల్డ్ వీడియో వైరల్ గా మారింది. ఇక సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందంపై అంతగా నమ్మకం లేని సాయి పల్లవి తనను మధ్యలో తీసేస్తారేమో అని భయపడేదట. ప్రేమమ్ బ్లాక్ బస్టర్ కావడంతో సాయి పల్లవికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో సాయి పల్లవి మొదటి సినిమా ఫిదా భారీ విజయం అందుకుంది. 

ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా తండేల్ మూవీ చేస్తుంది. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి ఈ చిత్ర దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఎమోషనల్ లవ్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. నితేశ్ తివారి తెరకెక్కించనున్న రామాయణం మూవీలో సాయి పల్లవి సీత పాత్ర చేస్తుంది. రన్బీర్ కపూర్, యష్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రానికి గానూ సాయి పల్లవి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. 

Body with curves. Eye-Feast dance performance on college fest by for Sheela Ki Jawani song. T-Series🔥
. pic.twitter.com/McynZTu1jm

— Chandu Rajini (@IamChanduRajini)

 

 

click me!