గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మెగా పవర్ స్టార్ అభిమానులు స్పెషల్ పోస్టర్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. అడ్వాన్డ్స్ విషెస్ తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఈ బర్త్ డే చాలా ప్రత్యేకం కానుంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నారు. త్వరలో హాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరోవైపు చరణ్ తండ్రి కూడా కాబోతుండటం విశేషం. ఇన్ని విశేషాల మధ్య రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకులను అభిమానులు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో మూడు రోజుల ముందుగానే సెలబ్రేషన్స్ ను షురూ చేశారు. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్స్ వదులుతూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు అభిమానులు, ప్రముఖులు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా స్పెషల్ సీడీపీ పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఆర్ఆర్ఆర్’లోని సీతారామరాజు పాత్రకు సంబంధించిన లుక్ లోనే ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
రామ్ చరణ్ కు ‘ఆర్ఆర్ఆర్’లోని ఈ పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా బర్త్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఇలా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ముందుగానే బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక రేపు సాయంత్ర 6 గంటలకు ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.
Here's the special CDP to celebrate 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 garu’s Birthday 🎉
Wishing A Very Happy Birthday in advance ✨
Best wishes for ❤️🔥 pic.twitter.com/KNlSOnp8vr
ఇక జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023 కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సులో చరణ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆయా అంశాలపై తనదైన శైలిలో బదులివ్వడంపై ప్రశంసలు అందాయి. మరోవైపు ఇండియా టుడే స్పెషల్ ఇష్యూ : కాన్ క్లేవ్ 2023 వార్షిక ఎడిషన్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై విడుదల చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా రామ్ చరణ్ అంటూ స్పెషల్ పోస్టులు పెడుతున్నారు.
PRIDE OF INDIA 👑🦁’s Yearly Special Conclave Edition featuring Our GLOBAL STAR ✨
🔥 THE ROAR OF RAM 🔥 pic.twitter.com/1q0WbKlXtR
రామ్ చరణ్ పుట్టిన రోజులను చాలా గ్రాండ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 25, 26న ‘ఆరెంజ్’ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం భారీచిత్రాల్లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో RC15 రూపుదిద్దుకుంటోంది. త్వరలో బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 కూడా ప్రారంభం కానుంది. ఇక మరీ ప్రాజెక్ట్స్ కూడా చరణ్ లైనప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.