
మహేష్ బాబు తమిళ పండుగకు మద్దతిచ్చి ఆంధ్రుల జీవన పోరాటానికి ఎందుకు మద్దతివ్వటం లేదు. అంటే అతనికి రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్నంత బాధ్యత లేదా..? మహేష్ డబ్బింగ్ మార్కెట్ కోసం బాదపడ్డంత, అతన్ని సూపర్ స్టార్ని చేసిన అసలు మార్కెట్ కోసం బాదపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ పోరాటంతో కలిసిరాని సెలబ్రిటీలు ద్రోహులుగా మిగిలిపోతారు.
మహేష్ అభిమానులు ఆయనకు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపమని చెప్పకపోతే వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర సమస్యల కన్నా పవన్ గురంచి ఎక్కువగా కంగారు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే జల్లికట్టుకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు, పవన్కు ఎందుకు సపోర్ట్ చేయనట్టు..?' అంటూ తనదైన స్టైల్లో ప్రశ్చించాడు వర్మ.