
ఆ మధ్య ఓ సినిమా కోసం 'సిక్స్ ప్యాక్ ఫిజిక్' ట్రై చేసి, ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, రెస్ట్ తీసుకోవడం కోసమే ఈ 'గ్యాప్' అనే ప్రచారమూ తెరపైకొచ్చింది. ఎలాగైతేనేం, చాలాకాలం తర్వాత రవితేజ మళ్ళీ కన్పించాడు. అదీ 'టచ్ చేసి చూడు' అంటూ. అవును, ఇది రవితేజ కొత్త సినిమా టైటిల్. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రవితేజ మార్క్ మాస్ స్టయిల్‌లో స్టిల్‌ని రిలీజ్ చేసింది 'టచ్ చేసి చూడు' చిత్ర యూనిట్. రేపు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, ఫస్ట్ లుక్‌ని టైటిల్‌తోపాటు విడుదల చేసేశారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్స్. 'బెంగాల్ టైగర్' తర్వాత మరోమారు రవితేజతో 'టచ్ చేసి చూడు' సినిమాలో కన్పించబోతోంది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.