నాకు వోడ్కా.. మీకు విస్కీ.. మైసమ్మ దేవత ముందు రామ్‌గోపాల్ వర్మ పోస్టు వైరల్

By telugu teamFirst Published Oct 12, 2021, 6:56 PM IST
Highlights

సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపారు. వరంగల్‌లో ఓ మైసమ్మ గుడిలోకి వెళ్లి.. ఆ దేవతకు విస్కీ తాగించినట్టు పోజు పెట్టి పిక్ పోస్టు చేశాడు. అంతే కాదు.. చీర్స్ అని కూడా రాశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్ని లేపాయి.
 

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు ram gopal varma ఏది చేసినా చర్చనీయాంశమే అవుతుంది. ఏ మాట విడిచినా, ఏ పని చేసినా అదో వివాదమై కూర్చుంటుంది. తాజాగా, ఆయన వరంగల్ వెళ్లి మరో కొత్త వివాదానికి కేంద్రమయ్యారు. వరంగల్‌లో ఓ maisamma గుడిలోకి వెళ్లి రచ్చ చేశారు. మైసమ్మ దేవతకు తాను whiskey తాగిపించానని ఫొటో సహా పోస్టు పెట్టారు. ‘నేను కేవలం vodkaనే తాగుతా.. కానీ, మైసమ్మ దేవతతో విస్కీ తాగించా’ అంటూ ట్వీట్ చేశారు. అది సరిపోదన్నట్టు మరో ట్వీట్ చేశారు. అందులో దేవతకు ఎదురుగా నిలుచుని చీర్స్ అంటూ పిక్ పెట్టారు. ఈ పోస్టులు ట్విట్టర్‌లో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సాధించుకున్న కొండా దంపతుల జీవితాలను నేపథ్యంగా తీసుకుని రామ్‌గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా పేరు కొండాగా ఖరారు చేశారు. ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా, వరంగల్‌లో ఓ ర్యాలీకి ప్లాన్ చేశారు. గోకుల్ నగర్‌లో ర్యాలీ చూడటానికి ఉదయం 9 గంటలకు రావలసిందిగా ఆయన ట్విట్టర్ వేదికగా అభిమానులను కోరారు.

Though I only drink Vodka, I made the Goddess Maisamma drink Whisky 😃 pic.twitter.com/rcwHc2DSde

— Ram Gopal Varma (@RGVzoomin)

konda సినిమా.. తెలంగాణ రక్త చరిత్ర సినిమా అని పేర్కొన్నారు. ఆ పోస్టర్‌లో కొండా మురళి అగ్రెసివ్ లుక్ చూయించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే? అంటూ పోస్టర్‌పై కామెంట్ మెన్షన్ చేశారు. ఈ చిత్రంపై వర్మ తనదైన శైలిలో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. సాధారణంగా కొండా దంపతలు నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని నిర్మించడం, దీనికి నక్సల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read: చైతు-సమంత విడాకులు: విడాకులను వేడుక చేసుకోవాలి.. ఎందుకంటే.. వర్మ ట్వీట్ వైరల్

ప్రజలారా కొండా ర్యాలీ చూడటానికి రండి అంటూ పిలుపునిచ్చారు వర్మ. కానీ, పోలీసులు ఆయన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు తన సినిమా ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఉండి పబ్లిసిటీ కల్పించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. తర్వాత ఆయన ఓ మైసమ్మ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడే మైసమ్మ దేవతకు విస్కీ తాగించినట్టు ఓ పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోతుండగా, ఇంకొందరు మైసమ్మకు కళ్లు మొక్కడం ఆచారమే కదా అని సర్దుకుపోతున్నారు. ఏమైనా పీట్‌తోనూ వర్మ.. తన కొండా మూవీకి పబ్లిసిటీ చేసుకున్నారు.

click me!