కేసీఆర్ జీవితంపై మూవీ తీస్తున్నా-వర్మ

Published : Oct 21, 2016, 05:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కేసీఆర్ జీవితంపై మూవీ తీస్తున్నా-వర్మ

సారాంశం

కేసీఆర్ జీవితంపై రామ్ గోపాల్ వర్మ చిత్రం ఆర్.సి.కే. టైటిల్ పెట్టి కేసీఆర్ జీవితంపై వర్మ సినిమా కేసీఆర్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక ట్వీట్ తో కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తునే ఉంటాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మూవీ తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాత మధుర శ్రీధర్ ప్రకటించిన నేపథ్యంలో... అదే కేసీఆర్ పై..ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆర్.సీ.కే పేరుతో కేసీఆర్ గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలతో మూవీ తీస్తానని ట్వీట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్ట్రెయిట్ గా కేసీఆర్ జీవితంలోని విభిన్న కోణాన్ని ఆ మూవీలో ఆవిష్కరిస్తానంటున్నాడు వర్మ. బయటికి కనిపించే కేసీఆర్ అందరికీ తెలులు, కానీ కేసీఆర్ మైండ్ ఏంటో,ఎలా ఆలోచిస్తుందో.. తెరకెక్కిస్తానంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. కేసీఆర్ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో ఈ మూవీన తరహాలో మరేదీ ఉండదని వర్మ బల్లగుద్ది చెప్తున్నాడు.

రాజకీయాల్లో ఉండే కుళ్లును ఈ మూవీలో చిత్రీకరిస్తానంటున్న వర్మ.. కేసీఆర్ తెలంగాణ బ్రూస్ లీ అనడంలో సందేహం లేదంటున్నారు. కేసీఆర్ జీవితంపై వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె హీరోయిన్ అని ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేశాడు.

ఉద్యమాన్ని గమ్యం ముద్దాడించిన కేసీఆర్ జీవితం సినిమా స్టోరీగా క్రేజ్ సంపాదించడం, అందునా వర్మ లాంటి క్రియేటివ్ దర్శకుడు కేసీఆర్ పై మూవీ తీస్తానని ప్రకటించడం మాత్రం తెలుగు ప్రేక్షకులకు సంతోషకరమే.

కానీ ఇదే సందర్భంలో కేసీఆర్ ఫేస్ గురించి గతంలో రెండు మూడు సార్లు ట్వీట్లు చేసిన వర్మ... దాంట్లో నెగెటివ్ అంశాలేమీ లేవని వివరణ ఇచ్చాడనే విషయాన్ని కూడా అంతా గుర్తు చేసుకుంటున్నారు. మరి వర్మ కేసీఆర్ పై  రివర్స్ టైటిల్ పెట్టి సినిమా తీస్తానంటున్న నేపథ్యంలో... రివర్స్ లో సినిమా తీస్తాడా లేక స్ట్రెయిట్ గా తీస్తాడా అని అంతా అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?
Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి