
మొత్తానికి బాహుబలి మూవీ ప్రభాస్కు ఇచ్చిన సక్సెస్ కిక్ మాత్రం మామూలుది కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ దశ తిరిగింది. తన స్టార్ ఇమేజ్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ప్రపంచ ప్రముఖుల సరసన తన మైనపు విగ్రహం ప్రతిష్టించే వరకు వెళ్లింది. పెళ్లికి ముందు తనజీవితంలో చెప్పుకోవడానికి ఓ గొప్ప అధ్యాయం ఉండాలని భావించిన ప్రభాస్.. చివరకు అనుకున్నది సాధించాకే పెళ్లికి రెడీ అయ్యాడు.
‘బాహుబలి-2' షూటింగ్ ప్రస్థుతం చివరి దశలో ఉంది. అది పూర్తి కాగానే.. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలయ్యేందుకు సిద్ధం కాబోతున్నాడు. వచ్చే సమ్మర్లో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బాహుబలి-2 సినిమా రిలీజ్ కంటే ముందే ప్రభాస్ వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి టుసాడ్ రేంజ్ స్టార్ ప్రభాస్ ను వరించే అమ్మాయి ఎవరనేది ప్రస్థుతానికి సస్పెన్స్ గానే కొననసాగుతోంది. కొంతకాలంగా ప్రభాస్ కు తగిన అమ్మాయి వేటలో ఉన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ ఒడ్డు పోడవు, అందానికి తగిన సరిజోడి అయిన పెళ్లి కూతురుని ఎంపిక చేసారట. ప్రభాస్ ను వరించబోయే ఆ అదృష్టవంతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమర్తె అని తెలుస్తోంది.