సన్నీ బన్నా చాహతీ హూంతో.. సానియాకు లింకు పెట్టిన వర్మ

Published : Jun 09, 2017, 05:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
సన్నీ బన్నా చాహతీ హూంతో.. సానియాకు లింకు పెట్టిన వర్మ

సారాంశం

మై సన్నీ లియోనీ బన్ నా చాహతీ హూం అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన వర్మ సన్నీ లియోనీ మూవీకి సానియా మీర్జాకు లింకు పెట్టి సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ సంచలన దర్శకుడి సోషల్ మీడియా సెన్సేషన్స్ ఆగవంటే ఆగవని ప్రూవ్ అయింది

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ‘సర్కార్‌-3’ ఘోర వైఫల్యం వల్ల వెండితెరకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. తాజాగా ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించాడు. ఆ సినిమా గురించి సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆసలు ఆ సినిమా తాను ఎందుకు తీశానో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పాడు వర్మ. 

 

‘నేను ఇటీవల తీసిన ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై’.. తనకు గతం గుర్తుచేసిందని ఓ అమ్మాయి ఇటీవల నాకు మెసేజ్‌ చేసింది. ఆ అమ్మాయి గతంలో ఎంతో మంచి టెన్నిస్‌ ప్లేయర్‌ అట. అయినప్పటికీ ఆ అమ్మాయి యుక్త వయసుకొచ్చాక ఆమె తండ్రి ఆమెను టెన్నిస్‌ అడనివ్వలేదట. దానికి కారణం ఆ ఆటలో భాగంగా పొట్టి స్కర్టులు వేసుకోవాల్సి రావడమే. ఇలాంటి భావాలతో మహిళలను అణగదొక్కే సుంకుచిత మనస్తత్వాలను గురించి చెప్పేందుకే నేను ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తీశాన’ని చెప్పాడు వర్మ.

 

టెన్నిస్ ప్లేయర్ అని చెప్పాడు, కంటెంట్‌ బాగానే ఉంది, అయినప్పటికీ ఆయన షేర్‌ చేసిన సానియా ఫోటో కాస్త వివాదాస్పదంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు