
పబ్లిక్ తో క్రేజ్ ఉన్న రియల్ కేరక్టర్లను బేస్ చేసుకుని హిట్ సినిమాలు తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ధ హస్తుడు. వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వంగవీటి రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా వర్మ మరో క్రేజీ పర్సనాలిటీ పై సినిమా ఎనౌన్స్ చేశాడు.
దేశవ్యాప్తంగా ఏ భారీ సంఘటన జరిగినా సినీ రంగం నుంచి ముందుగా స్పందించే వ్యక్తి రాంగోపాల్ వర్మ. అయితే వర్మ స్పందనపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రతీ విషయాన్ని తన సినిమా కథ కోసం లేక పబ్లిసిటీ కోసమో వాడుకోవటం వర్మకు అలవాటు. తాజాగా తమిళనాట అమ్మ మరణం తరువాత వినిపిస్తున్న శశికళ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నానని ఎనౌన్స్ చేశాడు వర్మ.
ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వర్మ ప్రస్తుతం వంగవీటి, నయీం లాంటి యాథార్థ కథలతో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే శశికళ పేరుతో తెరకెక్కించే సినిమా మాత్రం పూర్తి కాల్పనిక కథతో తెరకెక్కిస్తున్నాడట. అది కూడా రాజకీయాలు లేని కథాశంతో.. తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.