ఈ 30న నారా రోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు'

Published : Dec 15, 2016, 11:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఈ 30న నారా రోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు'

సారాంశం

డిసెంబర్ 30న నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు రోహిత్ తో పాటు ప్రధాన పాత్రల్లో శ్రీ విష్ణు,తాన్యా హోప్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్‌. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీవిష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని,  ఈనెల 30న విడుదలవుతోంది.

 

నిర్మాత మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకూ రాని వైవిధ్యభరితమైన కథా చిత్రమిది. ‘ప్రతినిధి’ చిత్రం తర్వాత రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించారు. ఒకరు పోలీసాఫీసర్‌గా, మరొకరు క్రికెటర్‌గా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నారా రోహిత్‌ సహకారంతోనే ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. సాయికార్తీక్‌ పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

 

ఈ చిత్రానికి కెమెరా: నవీన్‌ యాదవ్, సమర్పణ: నారా రోహిత్‌.

PREV
click me!

Recommended Stories

Ram Charan : హైదరాబాద్ లో రామ్ చరణ్ బంగ్లా లోపల ఎలా ఉందో చూశారా?
4000 కోట్ల రామాయణం పై బిగ్ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఎప్పుంటే?