చరణ్ సుకుమార్ ల చిత్రం శాటిలైట్ రైట్స్ 16 కోట్లు?

Published : Jun 21, 2017, 04:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చరణ్ సుకుమార్ ల చిత్రం శాటిలైట్ రైట్స్ 16 కోట్లు?

సారాంశం

చరణ్ సుకుమార్ ల చిత్రం శాటిలైట్ రైట్స్ 16 కోట్లు? 70 కోట్ల వరకు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థం 1985

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమా శాటిలైట్ బేరాలు స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద రేటే పలికినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 16 కోట్లకు శాటిలైట్ రైట్స్ ఫిక్స్ అయ్యాయని, ఇంకా అగ్రిమెంట్ మాత్రం కాలేదని తెలుస్తోంది.

 

రామ్ చరణ్ సినిమాకు 16 కోట్లు అంటే అది చాలా పెద్ద మొత్తమే. అయితే సుకుమార్ డైరక్టర్ కావడం, గ్రామీణ నేఫథ్యంలో, డిఫరెంట్ మూవీగా తయారు చేస్తుండడంతో ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది. మరోవైపు రంగస్థలం 1985 సినిమాకు ఖర్చు కాస్త భారీగానే అవుతోందని తెలుస్తోంది. ప్రస్థుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో అక్కడి షెడ్యూల్ పూర్తి చేేసుకోనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో వేసే భారీ సెట్ లో నే షూటింగ్ జరుగుతుందట. ఈ సెట్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఇక రెమ్యూనిరేషన్ కూడా భారీగానే వుంది. సుకుమార్, రామ్ చరణ్, సమంత, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా అంతా టాప్ స్టార్స్ కావటంతో పేమెంట్ కూడా కాస్తా భారీ ఖర్చే.

 

అందుకే సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మైత్రీ మూవీస్ సంస్థ అధినేతలు మాత్రం చాలా ధీమాగా వున్నారు. ఈ సినిమా సుకుమార్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని, కథలో ఆ రిచ్ నెస్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా