మళ్లీ యోగా అంటున్న అనుష్క

Published : Jun 21, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మళ్లీ యోగా అంటున్న అనుష్క

సారాంశం

అనుష్క షెట్టి సినిమాలకు రాకముందు యోగా టీచర్ నాగచైతన్య కు యోగా టీచర్ గా వ్యవహరించిన అనుష్క అందం, అభినయం ఉండటంతో సూపర్ తో  టాలీవుడ్ ఎంట్రీ యోగా డే సందర్భంగా యోగా కు థాంక్స్ చెప్తూ అనుష్క ఎఫ్ బి పోస్ట్

తెలుగు హీరోయిన్లలో అగ్రస్థానంలో ఉన్న హీరోయిన్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. అందం, అభినయం, ఠీవీ అన్నీ ఆమె సొంతం. అనుష్క సినిమాల్లోకి రాక ముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. యోగా టీచర్ గా ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలతోనే ఆమె సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

 

ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అనుష్క సినిమాల్లోకి రాక ముందు తన యోగా టీచర్ లైఫ్ గుర్తు చేసుకుంది. యోగా నా జీవితాన్ని మార్చేసిందని చెబుతూ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ చెప్పింది. ‘నా జీవితంలో మర్చిపోలేని నిర్ణయం నేను యోగా టీచర్ అవ్వాలనే నిర్ణయం. నేనెు డాక్టర్లు, ఇంజినీర్ల కుటుంబం నుండి వచ్చాను. అలాంటిది నేను యోగా ఎంచుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. నా జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో మార్పులకు యోగానే కారణం. హ్యాపీ ఇంటర్నేషనల్‌ యోగా డే' అంటూ అనుష్క ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.

 

అనుష్క సినిమాల్లోకి రాకముందు బెంగుళూరులోని ఈస్ట్‌ వుడ్ పాఠశాలలో యోగ టీచర్ గా పనిచేసింది. అప్పుడు తన సహచర ఉపాధ్యాయులతో కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. అక్కినేని ఫ్యామిలీ ద్వారా నాగ చైతన్యకు అనుష్క యోగా పాఠాలు చెప్పింది. అలా అక్కినేని ఫ్యామిలీకి పరిచయం అవ్వడం, హీరోయిన్ గా సూటయ్యే ఫిజిక్ ఉండటంతో నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేయడం జరిగిపోయింది.

 

సూపర్ సినిమాలో గ్లామర్ రోల్ తో ఆకట్టుకున్న అనుష్క.. ఆ తర్వాత అందం మాత్రమే కాదు, అభినయం పరంగా కూడా ది బెస్ట్ అని నిరూపించుకుంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి చిత్రాలతో పాత్ర ఏదైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా