
హీరోగా ధృవ, నిర్మాతగా ఖైదీ నంబర్ 150 లాంటి రెండు భారీ విజయాలను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రాన్ని మొదలెట్టేస్తున్నాడు. ధృవ తరువాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా.. లొకేషన్ల ఎంపిక పూర్తి కాకపోవటంతో షూటింగ్ ఆలస్యమైంది. అయితే శనివారం షూటింగ్లో పాల్గొనేందుకు చరణ్ రాజమండ్రి చేరుకున్నాడు.
ఖైదీ నంబర్ 150లో చిరును కొత్తగా చూపించిన కాస్ట్యూమ్ డిజైనర్, మెగా డాటర్ సుశ్మిత కూడా చెర్రీతో పాటు రాజమండ్రి చేరుకుంది. సుకుమార్ దర్శకత్వంలో పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుశ్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది. తొలిసారిగా చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు వైభవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.