బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న పూరీ

Published : Apr 01, 2017, 01:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న పూరీ

సారాంశం

రీసెంట్ గా రోగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పూరీ జగన్నాథ్ వరుసగా ఫ్లాపులతో బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న పూరీ పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 101వ సినిమా  

నందమూరి నట సింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య మరింత కేర్ తీసుకుని స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నారు. మరి దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీ ఏంటో గానీ... కృష్ణ వంశీ దర్శకత్వంలో ఫినిష్ చేయాల్సిన రైతు సినిమాను పక్కనబెట్టి పూరీ సినిమాను చకచకా ఫినిష్ చేస్తున్నాడు. 

 

తన 101వ సినిమాను పూరీ జగన్నాథ్‌ చేతిలో పెట్టిన బాలయ్య సైరన నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ ఫీలయ్యారు. కానీ హీరోలకు డిఫరెంట్‌ ఇమేజ్‌ అందించే పూరీ అనగానే సంతోష పడ్డ అదే బాలయ్య ఫ్యాన్స్‌ ఇప్పుడు రోగ్ రిలీజ్ తర్వాత టెన్షన్ పడుతున్నారు. పూరీ వరుస వైఫల్యాలు బాలయ్య ఫ్యాన్స్‌ను టెన్సన్‌ పెడుతున్నాయట.

 

‘లోఫర్‌’, ‘ఇజమ్‌’, ‘రోగ్‌’ సినిమాలు పూరీకి హ్యాట్రిక్‌ ఫ్లాపులను మిగిల్చాయి. బాలయ్య ఫ్యాన్స్‌ టెన్సన్‌కు ఇదే కారణమట. తాజాగా విడుదలైన ‘రోగ్‌’ సినిమా ఫలితమే తమ హీరో సినిమాకు ఎదురవుతుందేమోనని వారు టెన్సన్‌ పడుతున్నారు. అయితే మరోపక్క పూరీ స్టామినాను తక్కువ అంచనా వేయకూడదని కూడా కొంతమంది అంటున్నారు. వరుస ఫ్లాపుల మధ్య ఎన్టీయార్‌కు ‘టెంపర్‌’లాంటి హిట్‌ అందించిన పూరీ.. ఇప్పుడు బాలయ్యకు కూడా అదే స్థాయి విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశతో ఉన్నారు. మరి, ఆ ఫ్యాన్స్‌ ఆశలను పూరీ నెరవేరుస్తాడో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్