అనసూయకు మెగా ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్

Published : Jun 27, 2017, 01:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అనసూయకు మెగా ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్

సారాంశం

మరో మెగీ హీరోతో రొమాన్స్ చేయనున్న అనసూయ ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ తాజాగా రామ్ చరణ్ రంగస్థలం 1985లో అనసూయ

బుల్లితెరపై తన సత్తా చాటి వెండి తెరపైనా తానేంటో నిరూపించుకుంది అనసూయ. ఇప్పుడు ఈ బుల్లి తెర లేడీ స్టార్ అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం దక్కింది. చెర్రీ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా అనసూయే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో రంగస్థలం షూటింగ్‌కి వస్తున్న నటీనటులకు స్వాగతం అంటూ రాసింది.

 

దీన్ని బట్టి రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ కూడా నటిస్తోందని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసరాల్లో జరుగనున్నట్లు సమాచారం. కాగా అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’.., ‘క్షణం’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా