
శ్రీవళ్లి ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత, శ్రీవళ్లి చిత్ర దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామ్ చరణ్ రావటం చాలా సంతోషంగా వుందని, భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టేనని, అది గ్యారంటీ అనిపిస్తోందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనసు అనేది ఎలా వుంటుందో చూడాలనుకునే ప్రయత్నం చేస్తూ తీసిన సైంటిఫిక్ థ్రిల్లర్ ఈ శ్రీవళ్లి అన్నారు. యువతకు నచ్చేసినిమా అన్నారు.
ఇక శ్రీవళ్లి ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ మాట్లాడుతూ కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు. గొంతు కూడా బాగోలేదు. అయినా విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ల ఈవెంట్ కి పిలవకపోయినా వచ్చేవాన్ని నేను. కేవలం మిమ్మల్ని కలవడానికి, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి కోసం వచ్చాను. మగధీర కథ నాకు ఇచ్చినందుకు మా ఫ్యామిలీ తరపున థాంక్స్ చెప్తున్నాను. ఆన కథ అంటేనే దేశవ్యాప్తంగా క్రేజ్ వుంటుంది. అలాంటి గొప్ప రచయిత దర్శకుడిగా రావడం గొప్ప విషయం. శ్రీవళ్లి సినిమా గురించి చెప్పాలంటే.. ఇదో వెరైటీ కథాంశం. సాధారణంగా సైన్స్ థ్రిల్లర్ జేనర్ హాలీవుడ్ లో వుంటుంది. అలాంటి కథను తెలుగులో తెరకెక్కించడం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. గొప్ప రైటర్ రాసిన సబ్జెక్ట్ అందునా.. ఆయనే డైరెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా వుంటుందో శ్రీవళ్లి అంతే బాగుంటుంది అనే నమ్మకం వుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవాలి, ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చిన మా అభిమానులకు అందరికీ పేరుపేరున థాంక్స్ అన్నారు రామ్ చరణ్.
తాకితే కరెంట్ ఎలా వస్తుందో చూడాలన్న శ్రీలేఖ, రామ్ చరణ్షేక్ హ్యాండ్...
ఇక సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ తన సంగీత దర్శకురాలిగా పరిచయం చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమానికి వచ్చారని,, ఇక ఇప్పుడు 75వ సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్ రావడం సంతోషంగా వుందని ఎంఎం శ్రీలేఖ అన్నారు. రజత్ నేహా హిరోహిరోయిన్లుగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీవళ్లి ఆకట్టుకుంటుందని శ్రీలేఖ అన్నారు. ఈ సందర్భంగా ధీర ధీర పాట పాడిన శ్రీలేఖ.. మగధీరలో హిరోయిన్ కాజల్ తనని తాకితే కరెంట్ వస్తుండే సీన్ తనకెంతో ఇష్టమని.. ఒక్కసారి టచ్ చేసి ఆ కరెంట్ ఎలా వుంటుందో చూడాలని అంది. దాంతో షేక్ హ్యాండ్ ఇచ్చి శ్రీలేఖ సరదా తీర్చారు రామ్ చరణ్.
ఇక పాలకొల్లు కు చెందిన తమను ఆశీర్వదించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం సంతోషకరమని నిర్మాత అన్నారు.