డిసెంబ‌ర్ 4న గ్రాండ్ గా 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

Published : Nov 26, 2016, 06:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
డిసెంబ‌ర్ 4న గ్రాండ్ గా 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సారాంశం

దుమ్మురేపుతున్న ధృవ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్మాత నిర్ణయం మెగా ఫ్యాన్స్ కోసం డిసెంబర్ 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో వేడుక

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌`. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌రణ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్ర‌క‌టించిన రోజు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత  రాంచ‌ర‌ణ్‌, గీతార్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ `ధృవ` కావ‌డంతో సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

 

అంద‌రి అంచ‌నాల‌కు మించుతూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు `ధృవ` ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. విడుద‌లైన ఇరవై నాలుగు గంట‌ల్లోనే 2 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకున్న `ధృవ‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇప్ప‌టికి నాలుగు మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్నారు.

 

అంత కంటే ముందుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 4న హైదరాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ లైన్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీసుల గొప్పదనాన్ని చూపే సినిమా కావడంతో సాధారణంగా సినిమా ఫంక్షన్‌లు జరిగే ప్రాంతంలో కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను పోలీసుల క్వార్టర్స్ అయిన యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో నిర్వహిస్తే బాగుంటుందని టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

 

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ ,  ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

PREV
click me!

Recommended Stories

Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు