ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ , లోకల్ కంటెంట్..అదే #RC16

Published : Jul 02, 2023, 08:48 AM IST
 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ , లోకల్ కంటెంట్..అదే  #RC16

సారాంశం

 ఈ చిత్రం ఆగస్ట్ 2023లో సినిమా అఫీషియల్ లాంచ్ అవుతుంది. సినిమా షూటింగ్   సెప్టెంబర్ సినిమా లో షూటింగ్ ప్రారంభం కానుంది.


స్టార్ హీరోలతో పెద్ద ప్రాజెక్టుల వల్ల పెద్ద పెద్ద పేరు వస్తుందనేది నిజమే. కానీ ఆ ప్రాజెక్టులు అన్నీ సెట్ అయ్యి ప్రారంభం కావాలంటే చాలా టైమ్ పడుతుంది. ప్రోపర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తూంటారు. అందుకోసం చాలా ఓపిగ్గా వెయిట్  చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు పరిస్దితి అదే.  రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రీసెంట్ దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ని కలిశారు. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ప్రాజెక్టు ఉందని కన్ఫర్మ్ చేసారు.

ఇక ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగస్ట్ 2023లో సినిమా అఫీషియల్ లాంచ్ అవుతుంది. సినిమా షూటింగ్   సెప్టెంబర్ సినిమా లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే  సినిమాలో విఎఫ్ ఎక్స్ వర్క్ ఉండటం వలన ...దాదాపు ఏడాది పాటు వర్క్ జరిగి..జనవరి 2025 న రిలీజ్ ప్లాన్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇంకా 2023 సగంలోనే ఉండటంతో ..అప్పటిదాకా వెయిటింగ్ అనేది ఫ్యాన్స్ కు కష్టమే.  ఇక ఈ సినిమా ఒక పీరియడ్ చిత్రం. 

ఇందులో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని వినికిడి. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరక్టర్ గా కనిపించనున్నారు. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ..లోకల్ కంటెంట్ తో తీయాలనే ఆలోచన అని  తెలుస్తోంది. అందుకోసం టెక్నీషియనస్ ని ఇండస్ట్రీ టాప్ పర్శన్స్ ని తీసుకోబోతున్నారు. రెగ్యులర్ మసాలా సినిమాలా మాత్రం ఉండదని అంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఖాళీగా ఉన్నారు. దర్శకుడు శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వచ్చే నెలలో మళ్ళీ మొదలు కానుంది.   గ్యాప్ దొరకడంతో రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి డిస్కషన్స్ చేస్తున్నారు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..