ఫిబ్రవరి లోనే 'యాత్ర -2' రిలీజ్ ఫిక్స్...కారణం ఆ సెంటిమెంటే

Published : Jul 02, 2023, 08:13 AM IST
   ఫిబ్రవరి లోనే 'యాత్ర -2'  రిలీజ్ ఫిక్స్...కారణం ఆ సెంటిమెంటే

సారాంశం

'యాత్ర 2'లో వైయస్సార్ తనయుడు జగన్ మోహన్  రెడ్డి చేసిన పాదయాత్రను చూపించబోతున్నారు. తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది? అనేది చూపించబోతున్నారు. 

ఫిబ్రవరి లోనే 'యాత్ర -2'  రిలీజ్...కారణం ఆ సెంటిమెంటే

“నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ.. వదిలిన యాత్ర 2 పోస్టర్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ ఒక్క డైలాగుతోనే జగన్ అభిమానులకు ఆనందం కలిగించారు. ఇక అదే సమయంలో ‘యాత్ర 2’ రిలీజ్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలిపారు. అయితే పిభ్రవరినే ఎంచుకోవటం వెనక అసలు విషయం ఏమిటంటే..

  2019 ఫిబ్రవరిలో ‘యాత్ర’ విడుదల అయింది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముంగిట ‘యాత్ర 2’ని రిలీజ్ చేయనున్నారు. సెంటిమెంట్ గా పిభ్రవరి నెల వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. అప్పటి మ్యాజిక్ మళ్లీ జరుగుతుందంటున్నారు. ‘యాత్ర 2’ కీలక టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్‌లో తెలిపారు.


ఇక ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జీవితం నేప‌థ్యంలో యాత్ర -2 సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ సీక్వెల్‌పై డైరెక్ట‌ర్ మ‌హి.వి. రాఘ‌వ్ క్లారిటీ ఇచ్చాడు. యాత్ర -2 గురించి ట్విట్ట‌ర్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. జూలై 8 ఈ సినిమాపై అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. జూల్ 8న వైఎస్ జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త మాజీ సీఏం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతి. 

అందుకే ఆ రోజున సీక్వెల్‌పై అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో దాదాపు ఏడాది పాటు జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌తో పాటు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం లాంటి అంశాల‌ను యాత్ర 2లో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ న‌టుడు జీవా క‌నిపించనున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ రోల్‌కు సంబంధించి బాడీలాంగ్వేజ్‌, హావ‌భావాల విష‌యంలో జీవా రీసెర్చ్ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సీక్వెల్‌లో జీవాతో పాటు ప‌లువురు టాలీవుడ్‌, కోలీవుడ్ ఫేమ‌స్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. యాత్ర 2 సినిమాకు ద‌స‌రా మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

2019లో మ‌హి. వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాత్ర క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. వై.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌ను మ‌మ్ముట్టి పోషించారు. ఓ వైపు యాత్ర -2 ప‌నుల‌తో బిజీగా ఉన్న మ‌హి. వి .రాఘ‌వ్ ఇటీవ‌ల సైతాన్ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్‌కు కొన‌సాగింపుగా సెతాన్ -2 కూడా రాబోతుంది.
 

PREV
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం