రామ్ చరణ్ , బోయపాటి సినిమా ప్రారంభ ముహూర్తం ఫిక్స్

Published : Dec 05, 2017, 11:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
రామ్ చరణ్ , బోయపాటి సినిమా ప్రారంభ ముహూర్తం ఫిక్స్

సారాంశం

రామ్ చరణ్ రీసెంట్ ధృవ హిట్ తాజాగా రంగస్థలం చిత్రంలో నటిస్తున్న చెర్రీ త్వరలో బోయపాటి దర్శకత్వంలో చరణ్ మూవీ రాజమౌళి, ఎన్టీఆర్ లతో కాంబినేషన్ మూవీ దీని తర్వాతే

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ నెలాఖర్లో సినిమా ప్రారంభోత్సవం జరిపి, జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరపనున్నట్లు సమాచారం.

 

బోయపాటి శ్రీను ఈ ఏడాది ‘జయ జానకి నాయక’ చిత్రం తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచింది.

 

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ఇందులో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ఈ చిత్రం తర్వాతే వుంటుందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది, రష్మీ షాకింగ్ కామెంట్స్.. వెళ్లే ముందు అంతలా ఎందుకు అడుక్కుంది ?
MSG box office: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ 19 రోజుల కలెక్షన్లు.. చిరంజీవి సరికొత్త రికార్డ్