సైరా టీమ్ కు క్లాస్ పీకిన చెర్రీ!

Published : Apr 10, 2019, 02:46 PM ISTUpdated : Apr 10, 2019, 02:48 PM IST
సైరా టీమ్ కు క్లాస్ పీకిన చెర్రీ!

సారాంశం

సైరా మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న కూడా పనిలో వేగం పెంచలేదని చరణ్ యూనిట్ సబ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా తనయుడు రామ్ చరణ్  200 కోట్ల బారి బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు గత  రెండేళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకు సినిమా రిలీజ్ కాలేదు. 

గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందని ప్రతిసారి చిత్ర యూనిట్ కవర్ చేస్తూ వస్తోంది. అయితే ఫైనల్ గా చరణ్ సినిమాను దసరా టైమ్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అయితే సైరా మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న కూడా పనిలో వేగం పెంచలేదని చరణ్ యూనిట్ సబ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

VFX పనుల వల్ల దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసేలా లేరని ఇటీవల రూమర్స్ గట్టిగానే వచ్చాయి,. ఇకపోతే చరణ్ అందరికి క్లాస్ పీకినట్లు ఇన్ సైడ్ టాక్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ దసరా సమయానికి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుందో లేదో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?