ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. పవనే సాక్ష్యం.. రేణుదేశాయ్ కామెంట్స్!

Published : Apr 10, 2019, 02:23 PM ISTUpdated : Apr 10, 2019, 02:32 PM IST
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. పవనే సాక్ష్యం.. రేణుదేశాయ్ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ ఛానెల్ లో అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' అనే ప్రోగ్రాంకి సెలబ్రిటీలు వస్తూ.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తుంటారు. 

ప్రముఖ ఛానెల్ లో అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' అనే ప్రోగ్రాంకి సెలబ్రిటీలు వస్తూ.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు.

ఈసారి షోకి రేణుదేశాయ్ అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా అలీ అడిగిన ప్రశ్నలకు రేణు చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. 'రేణు' అనే పేరు మీకు ఇష్టం లేదంట కదా..? ఎందుకని అలీ ప్రశ్నించగా.. 'అవును.. నాకు నా పేరు అంటే నచ్చదు. రేవతి లేదా రేవ అని పెడితే బావుండేది' అని చెప్పింది.

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంట..? అనే ప్రశ్నకి స్పందించిన రేణు.. 'నేను జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్ గా చేశాను.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె.సూర్య గారు, రత్నం గారు, నా ఎక్స్ హజ్బెండ్ కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం' అంటూ చెప్పుకొచ్చింది.

రేణు పుట్టినప్పుడు తన తండ్రి ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ కి కూడా వెళ్లలేదట. ఈ  విషయాన్ని అలీ గుర్తుచేయగానే ఆమె ఎమోషనల్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..