
సాధారణంగా సినిమాలు ఫస్టాఫ్ మీద కన్నా సెకండాఫ్ మీద శ్రద్ద ఎక్కువ పెడతాయి. లెంగ్త్ ఎక్కువ ఉంటాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రం మాత్రం సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ లెంగ్త్ ఎక్కువ అని తెలుస్తోంది. RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీమ్ ప్రమోషన్స్ లో తమ దూకుడుని పెంచేసింది.ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఈ ఆసక్తికరమైన వార్త బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు ఆర్.ఆర్. ఆర్ ..సినిమా సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువట. తెలుగు వెర్షన్ దాదాపు 182 నిమిషాలు అంటే 3 గంటల 2 నిమిషాల రన్-టైమ్. ఫస్టాఫ్ 100 నిమిషాల రన్‌టైమ్ (1 గంట 40 నిమిషాలు) ఉండగా, సెకండాఫ్ 82 నిమిషాలు (1 గంట 22 నిమిషాలు) ఉందట. ఫస్టాఫ్ లో సెటప్ కు,కథ కాంప్లిక్ట్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారట. సెటప్ సరిగ్గా లేకపోతే సెకండాఫ్ పండదని ఇలా డిజైన్ చేసారట.
రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. హీరోల ఎంట్రీతో పాటు సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ రెండు పాత్రలు ప్రదర్శించే ఎమోషనల్ డ్రైవ్‌ను మాత్రమే మీరు చూస్తారు. క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. మీరు సినిమా చూడటం పూర్తవ్వగానే వెంటనే మళ్లీ చూడాలని అనిపిస్తుంది” అంటూ సినిమాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మరో ప్రక్క ఈ సినిమా బుక్ మై షోలో 1.5 మిలియన్ ఇంటెరెస్ట్స్ దాటేసి రికార్డు సాధించింది. ఇంతటి భారీ ఇంటెరెస్ట్స్ సాధించిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. . ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజు రాత్రి నుంచి స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.