`ది వారియర్‌` ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. రామ్ మోత మోగించేది అప్పుడే..

Published : Jun 28, 2022, 08:21 PM ISTUpdated : Jun 28, 2022, 08:25 PM IST
`ది వారియర్‌` ట్రైలర్‌  రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. రామ్ మోత మోగించేది అప్పుడే..

సారాంశం

రామ్‌ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన `ది వారియర్‌` మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ ని ప్రకటించింది యూనిట్‌.  రామ్‌ తన అభిమానులకు మాస్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

రామ్‌ పోతినేని సందడి ప్రారంభమైంది. ఆయన నటించిన `ది వారియర్‌` చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతో ఇక రామ్‌ కంటిన్యూగా వరుస సర్‌ప్రైజ్‌లతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ ఆకట్టుకుంది. సినిమాపై బజ్‌ ని క్రియేట్ చేసింది. దీంతో త్వరలో మరో ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. జులై 1న ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్టు తెలిపింది. శుక్రవారం సాయంత్రం 7.57గంటలకు ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. 

రామ్‌ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాని జులై 14న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే టీజర్‌, పాటలు అంచనాలను పెంచాయి. ఇప్పుడు ట్రైలర్‌తో మోతమోగించడం ఖాయమంటున్నారు. `బుల్లెట్‌` సాంగ్‌ వంద మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. విడుదలైన పాటలు ఛార్ట్ బస్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

వరుస పరాజయాల అనంతరం `ఇస్మార్ట్ శంకర్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రామ్‌.. రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. చివరి చిత్రం `రెడ్‌`కాస్త డిజప్పాయింట్‌ చేసినా, ఆ ప్రభావం ఆయనపై లేకపోవడానికి కారణం `ది వారియర్‌` మూవీనే కావడం విశేషం. ఇందులో రామ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. పైగా టీజర్‌లో ఆయన చెప్పిన డైలాగులు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. దీంతో సినిమా కోసం రామ్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో