పూరి పుట్టిన రోజుకు రామ్ ఇచ్చిన థ్రిల్లింగ్ గిఫ్ట్ ఇదే!

Published : Sep 30, 2019, 02:51 PM IST
పూరి పుట్టిన రోజుకు రామ్ ఇచ్చిన థ్రిల్లింగ్ గిఫ్ట్ ఇదే!

సారాంశం

హీరో రామ్ పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా పూరికి గోల్డ్ ఫాంట‌మ్ అనే వైర్ లెస్ స్పీక‌ర్స్‌ను ఇచ్చారు. ఇందులో `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట‌లు వింటూ పూరి ఎంజాయ్ చేశారు. ఆ వీడియో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి రామ్‌కి థ్యాంక్స్ చెప్పారు పూరి. 

వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రామ్ కు పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం  `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో  హిట్ ఇచ్చారు. దాంతో రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మాస్ హీరోగా రామ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. పూరి కూడా ఈ సినిమాతో ఒడ్డున పడ్డారు. వరస ఫ్లాఫ్ ల నుంచి మాత్రమే కాకుండా ఆర్దిక పరిస్దితుల నుంచి కూడా సేవ్ చేసిందీ చిత్రం. ఈ నేపధ్యంలో జరుపుకుంటున్న పూరి పుట్టిన రోజు చాలా సంతోషకరమైన రోజుగా మారింది. ఎక్కడెక్కడి సెలబ్రెటీలకు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మళ్లీ పూరి కు పాత రోజులు తిరిగి వచ్చాయి.

ఈ సందర్బంగా హీరో రామ్ పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా పూరికి గోల్డ్ ఫాంట‌మ్ అనే వైర్ లెస్ స్పీక‌ర్స్‌ను ఇచ్చారు. ఇందులో `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట‌లు వింటూ పూరి ఎంజాయ్ చేశారు. ఆ వీడియో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి రామ్‌కి థ్యాంక్స్ చెప్పారు పూరి. ఈ స్పీక‌ర్ విలువ నాలుగువేల డాల‌ర్స్‌. అలాగే ఛార్మీ కూడా ఈ వీడియోని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ పూరితో `రొమాంటిక్‌` సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు. అలాగే మ‌రో ప‌క్క విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌డానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాని కూడా ఆయనే స్వయంగా నిర్మించనున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్