బిగ్ బాస్ 3: ఇంటిపై రాళ్ల వర్షం!

Published : Sep 30, 2019, 02:39 PM ISTUpdated : Sep 30, 2019, 02:45 PM IST
బిగ్ బాస్ 3: ఇంటిపై రాళ్ల వర్షం!

సారాంశం

బిగ్‌బాస్‌ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంటిసభ్యుల్లో కొంతమంది ఓ పట్టాన అర్థం కావట్లేదు. అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి బాబా భాస్కర్‌.   

బిగ్ బాస్ సీజన్ 3 పది వారాలు పూర్తి చేసుకుంది. గత వారం మొత్తం  రాహుల్, వరుణ్ గొడవ, శ్రీముఖి-బాబా ల మధ్య దూరం, అలీ రీ ఎంట్రీ ఇన్ని విషయాలతో షో ఇంటరెస్టింగ్ గా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రవి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్‌ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు ఎలాంటి సదుపాయాలూ లేని సాదాసీదా జీవితాన్ని గడపాల్సి వుంటుంది. దీంతో పాటు హౌస్ లో ఒక్కోసారి రాళ్ల వర్షం పడుతుంది.

ఆ సమయంలో ఇంటి సభ్యులు రాళ్లను సేకరించి వారి దగ్గర పెట్టుకోవాలి. బజర్ మోగిన ప్రతీసారి ఎవరి దగ్గరైతే ఎక్కువ విలువైన రాళ్లు ఉంటాయో వారు నామినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు.

అదే విధంగా తక్కువవిలువ ఉన్న రాళ్లను సేకరించినవారు నామినేట్‌ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. మరి ఈ టాస్క్ లో ఎవరు నామినేట్ అవుతారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది!

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?