రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ డిటెయిల్స్.. ప్రారంభమయ్యేది అప్పుడే..

Published : Jan 21, 2024, 08:15 PM IST
రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ డిటెయిల్స్.. ప్రారంభమయ్యేది అప్పుడే..

సారాంశం

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ఇవి చిత్రీకరణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యింది.  దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వినిపిస్తుంది.

మాస్‌ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు ఆయన గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్‌ శంకర్‌తో `మిస్టర్‌ బచ్చన్‌` అనే సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. దీంతోపాటు మరో సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. కమెడీ చిత్రాల దర్శకుడు అనుదీప్‌తో మాస్‌ మహారాజా సినిమా చేయబోతున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. 

అయితే ఇప్పటి వరకు దీనిపై ఓ క్లారిటీ రాలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదని,  రవితేజకి ఇంకా ఫైనల్‌ స్క్రిప్ట్ నెరేట్‌ చేయలేదని అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందట. సితార బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. అనుదీప్‌తో సితారలో కమిట్‌మెంట్‌ ఉంది. దీంతో ఆ మూవీని రవితేజతో చేయబోతున్నారట. లవ్‌ స్టోరీ, కామెడీ మేళవింపుగా, రవితేజ మార్క్ కొన్ని యాక్షన్‌ ఎలిమెంట్లతో సినిమా సాగబోతుందని తెలుస్తుంది. 

ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. ప్రారంభానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే, జూన్‌లో దీన్ని ప్రారంభించే అవకాశం ఉందట. ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆలోపు ఒక మూవీని పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో కాస్త రిలీఫ్‌ అవుతాడు. ఆ తర్వాత అనుదీప్‌ మూవీకి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

రవితేజ నాల్గోసారి గోపీచంద్‌ మలినేనితో కలిసి చేస్తున్నారు. సెకండ్‌ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు. మరోవైపు హరీష్‌ శంకర్‌తో ఓ రీమేక్‌ మూవీ చేస్తున్నారు. హిందీలో హిట్‌ అయిన `రైడ్‌` మూవీని `మిస్టర్‌ బచ్చన్‌` గా రీమేక్‌ చేస్తున్నారు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. రీమేక్‌ మూవీస్‌ పెద్దగా ఆడటంలేదు. కానీ హరీష్‌ రీమేక్‌ చేయడం ఆశ్చర్యంగా మారింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం